Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా నాకౌట్స్‌కు బుల్లి దేశం.. మట్టికరిచిన మాజీ ఛాంపియన్!

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ 2026 టోర్నీ సంచలనం నమోదైంది. పసికూన కేప్ వెర్డే అద్వితీయమైన ప్రదర్శనతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. శనివారం తెల్లవారుజామున సౌదీ అరేబియాతో జరిగిన గ్రూప్-హెచ్‌ మ్యాచ్‌‌ను 0-0తో కేప్ వేర్డే డ్రా చేసుకుంది. దాంతో గ్రూప్-హెచ్‌లో రన్నరప్‌గా నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది.

ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో యూరోపియన్ ఛాంపియన్స్ స్పెయిన్ చేతిలో ఉరుగ్వే పరాజయం పాలవ్వడం కేప్ వెర్డేకు కలిసొచ్చింది. జూలై 3న మయామి వేదికగా జరిగే తదుపరి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో కేప్ వెర్డే తలపడనుంది.

ఆఖరి వరకు ఉత్కంఠ..

సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో ఆట ప్రారంభమైన 17 నిమిషాల 12 సెకన్ల వరకు ఇరు జట్లు ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయాయి. ఈ ప్రపంచకప్‌లో అత్యంత సుదీర్ఘ సమయం తర్వాత నమోదైన మొదటి షాట్ ఇదే. సౌదీ కెప్టెన్ సలేమ్ అల్ దవ్సారీ కొట్టిన షాట్‌ను కేప్ వెర్డే డిఫెండర్ వాగ్నర్ పినా అద్భుతంగా అడ్డుకున్నాడు.

Debutant Cape Verde Creates History as Hold Saudi Arabia to Enter FIFA World Cup Last 32

ఆ తర్వాత కేప్ వెర్డే ఆటగాడు విల్లీ సెమెడో కొట్టిన షాట్‌ను సౌదీ కీపర్ మహ్మద్ అల్ ఒవైస్ అందుకున్నాడు. ఫస్టాఫ్ ముగిసే సమయానికి సౌదీ ప్లేయర్ మహ్మద్ కన్నో హెడర్ ద్వారా గోల్ చేయడానికి ప్రయత్నించగా.. కేప్ వెర్డే గోల్ కీపర్ వోజిన్హా దానిని సులువుగా అందుకొన్నాడు.

గోడలా నిలిచిన వోజిన్షా..

సెకండ్ హాఫ్‌లో కేప్ వెర్డే దూకుడు పెంచింది. జామిరో మోంటెరో, కెవిన్ పినాలు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సౌదీ ఆటగాడు అబు అల్ షామత్ కొట్టిన షాట్‌ను వోజిన్హా అడ్డుకోగా, చివరి నిమిషాల్లో లారోస్ డువార్టేకు లభించిన వన్-ఆన్-వన్ అవకాశాన్ని సౌదీ కీపర్ చేజార్చాడు. మ్యాచ్ ముగిసే సమయానికి సౌదీ ప్లేయర్ అబ్దుల్లా అల్ హమ్దాన్ కొట్టిన బలహీనమైన షాట్‌ను వోజిన్హా సులువుగా ఆపడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో కేప్ వెర్డే ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

తొలి ఆఫ్రికన్ జట్టుగా..

ప్రపంచకప్ అరంగేట్రంలోనే అజేయంగా నిలిచి, గ్రూప్ స్టేజ్ దాటిన తొలి ఆఫ్రికన్ జట్టుగా (2006లో ఘనా తర్వాత) కేప్ వెర్డే రికార్డు సృష్టించింది. 40 ఏళ్లు పైబడిన వయసులో ఒకటి కంటే ఎక్కువ గోల్స్ ఆడిప మూడో గోల్ కీపర్‌గా వోజిన్హా.. పీటర్ షిల్టన్, డినో జోఫ్ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కేప్ వెర్డే 15 సార్లు గోల్ కోసం ప్రయత్నించగా.. సౌదీ అరేబియా కేవలం 7 ప్రయత్నాలే చేయగలిగింది.

ఓటమెరుగని జట్టుగా..

ఈ టోర్నీ గ్రూప్ దశలో కేప్ వర్డే ప్రయాణం ఎందరికో ఆదర్శం. తమ తొలి మ్యాచ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ స్పెయిన్‌ను 0-0తో నిలువరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఉరుగ్వేతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 2-2తో పోరాడి డ్రా చేసుకుంది. చివరగా సౌదీ అరేబియాతో డ్రా చేసుకుని ఒక పాయింట్‌తో చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి ఎరుగని జట్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మక నాకౌట్‌కు అర్హత సాధించింది.

Story first published: Saturday, June 27, 2026, 10:16 [IST]
Other articles published on Jun 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+