అమీర్‌పేట్ అంత లేదు.. ప్రపంచకప్‌కు అర్హత
పట్టుదల ఉంటే ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించవచ్చని పసికూన దేశం క్యురసావ్ నిరూపించింది. కేవలం 1,56,115 మంది జనాభా కలిగిన కురుసావ్ దేశం.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీ అయిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా 95 ఏళ్ల చరిత్ర కలిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన అతి చిన్న దేశంగా క్యురసావ్ నిలిచింది.
ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో క్యురసావ్ గ్రూప్ బీ విజేతగా నిలిచి తొలిసారి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో జనాభా పరంగా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన అతి చిన్న దేశంగా ఐస్‌లాండ్ పేరిట ఉన్న రికార్డును క్యురసావ్ అధిగమించింది. 2018లో 3,50,000 జనాభా ఉన్న ఐస్‌లాండ్ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

కరీబియన్ దీవుల్లో 444 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ ద్వీపదేశం.. జమైకా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ బీ చివరి లీగ్ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. తద్వారా నాలుగు జట్లున్న గ్రూప్-బీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, మరో మూడు డ్రా చేసుకొని 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ కోచ్ డిక్ అడ్వోకాట్ ఆధ్వర్యంలో క్యురసావ్ ఈ ఘనతను సాధించింది. డిక్ అడ్వోకాట్ గతంలో నెదర్లాండ్స్, సౌత్ కొరియా జట్లకు కోచ్‌గా పనిచేశారు.
అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమిస్తున్న 2026 ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు ఆడనున్నాయి. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఇప్పటి వరకు 42 దేశాలు అర్హత సాధించగా.. మరో 6 దేశాలు ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ టోర్నీల ద్వారా అర్హత సాధిస్తాయి.
అర్హత సాధించిన దేశాలు..
అమెరికా, కెనడా,మెక్సికో, ఆస్ట్రేలియా, సెనెగల్, సౌతాఫ్రికా, ట్యూనిషియా, క్యురసావ్, హైతీ, పనామా, ఇరాన్, జపాన్, జోర్డాన్, సౌత్ కొరియా, ఖతర్, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, అల్జీరియా, కేప్ వెర్డె, ఐవరీకోస్ట్, ఈజిప్ట్, ఘనా, మొరాకో, అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, ఉరుగ్వే, న్యూజిలాండ్, ఆస్ట్రియా, బెల్జియం, క్రొయేషియా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్కాట్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications