Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: ఫైనల్లో ఫ్రాన్స్ గెలుపుకు కారణం రిఫరీ ‘వీఏఆర్‌’ నిర్ణయమేనా!

Croatia coach and TV pundits slam ridiculous VAR decision in Fifa World Cup final video

హైదరాబాద్: రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో క్రొయేషియాను 4-2తేడాతో ఓడించి ఫ్రాన్స్ 2018 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో రిఫరీ తీసుకున్న 'వీఏఆర్‌' నిర్ణయంపై క్రొయేషియా కోచ్, పుట్‌బాల్ విశ్లేషకులు మండిపడుతున్నారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ పెనాల్టీ ఏరియాలో బంతిపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న దశలో పెరిసిచ్‌ బంతిని అందుకుని ఏమాత్రం తడబాటు లేకుండా గోల్‌ కొట్టాడు. గోల్‌తో క్రొయేషియాను ఆదుకున్న పెరిసిచే ఓ ఘోర తప్పిదంతో ఫ్రాన్స్‌ తిరిగి ఆధిక్యం సంపాదించడానికి కారణమయ్యాడు.

గ్రీజ్‌మన్‌ గోల్‌ పోస్ట్‌ వైపు కిక్‌ కొట్టగా

గ్రీజ్‌మన్‌ గోల్‌ పోస్ట్‌ వైపు కిక్‌ కొట్టగా

గ్రీజ్‌మన్‌ గోల్‌ పోస్ట్‌ వైపు కిక్‌ కొట్టగా.. మటౌడి హెడర్‌ కోసం ప్రయత్నించినప్పటికీ, దానిని ప్రత్యర్ధి గోల్ పోస్టులోకి కొట్టలేకపోయాడు. ఈ క్రమంలో బంతి పెరిసిచ్‌ చేతికి తగిలింది. అయితే పెరిసిచ్ చేతితో బంతిని అడ్డుకున్నాడని రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. తొలుత పెనాల్టీకి అంగీకరించని రిఫరీ ‘వీఏఆర్‌' ద్వారా సుదీర్ఘ సమయం తీసుకొని దానిని నిర్ధారించడం వివాదాస్పదమైంది. పెరిసిచ్‌ చేతికి బంతి తగలడం వాస్తవమే అయినప్పటికీ, అది ఉద్దేశ పూర్వకంగా చేయలేదనే క్రొయేషియా ఆటగాళ్ల వాదన చెల్లలేదు.

 ఫ్రాన్స్ 2-1తో ఆధిక్యంలోకి

ఫ్రాన్స్ 2-1తో ఆధిక్యంలోకి

ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీని గ్రీజ్‌మన్‌ 38వ నిమిషంలో అలవోకగా గోల్‌గా మలచడంతో ఫ్రాన్స్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన వెళ్లింది. దీనిపై క్రొయేషియా కోచ్ జ్లాట్కో దలిక్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ "రిఫరీ నిర్ణయంపై మాట్లాడకూడదు. అయితే, వరల్డ్‌కప్ లాంటి మ్యాచ్‌ల్లో ఇలాంటి వాటికి రిఫరీ పెనాల్టీని ఇవ్వకూడదు" అని అన్నాడు. రష్యా వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఈ ‘వీఏఆర్‌' (వీడియో అసిస్టెంట్ రివ్వూ)ని తొలిసారి ఉపయోగించారు. టోర్నీలో చాలా వరకు వీఏఆర్ ద్వారా అంఫైర్లు మెరుగైన ఫలితాలనే రాబట్టారు.

‘వీఏఆర్‌' ద్వారా ప్రీ కిక్‌ను నిర్దారించడంపై

‘వీఏఆర్‌' ద్వారా ప్రీ కిక్‌ను నిర్దారించడంపై

అయితే, వరల్డ్‌కప్ ఫైనల్‌ లాంటి మ్యాచ్‌ల్లో ‘వీఏఆర్‌' ద్వారా ప్రీ కిక్‌ను ఫ్రాన్స్ లాంటి జట్టుకు నిర్ధారించడాన్ని ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ అలెన్ షీరర్ తప్పుబట్టారు. "ఈ మ్యాచ్‌లో క్రొయేషియా అద్భుతంగా ఆడింది. కేవలం ప్రీ క్విక్ ద్వారానే ఓటమిపాలైంది" అని అన్నారు. మరో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు రియో ఫెర్నాడిడ్ "మనం 100 శాతం ఖచ్చితంగా చెప్పలేం అది ఫ్రీ క్విక్ అని. అదే అలా లేనే లేదు. అతడు చేతితో కావాలని బంతిని అడ్డుకోలేదు. బంతిని అడ్డుకునేంత సమయం కూడా అతడికి లేదు. అందుకే రిఫరీ కూడా నిర్ణయం తీసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు" అని పేర్కొన్నారు.

రెండోసారి ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకున్న ప్రాన్స్

రెండోసారి ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకున్న ప్రాన్స్

కాగా, ఫైనల్లో విజయంతో ఫ్రాన్స్‌ రెండోసారి ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. 2018 టోర్నీలో ఒక్క మ్యాచ్‌ ఓడకుండా ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్లో క్రొయేషియాపై ఫ్రాన్స్ 4-2తేడాతో విజయం సాధించింది. క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్‌ (18వ నిమిషం) సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ ఖాతా తెరవగా... గ్రీజ్‌మన్‌ (38వ ని), పోగ్బా (59వ ని), ఎంబాపె (65వ ని) ఫ్రాన్స్ తరఫున గోల్స్‌ సాధించారు.

ఫైనల్లో 4 గోల్స్‌ కొట్టిన తొలి జట్టుగా ఫ్రాన్స్‌

ఫైనల్లో 4 గోల్స్‌ కొట్టిన తొలి జట్టుగా ఫ్రాన్స్‌

క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ ని), మాన్‌జుకిచ్‌ (69వ ని) గోల్స్‌ సాధించారు. 1970 (బ్రెజిల్‌) తర్వాత ఫైనల్లో 4 గోల్స్‌ కొట్టిన తొలి జట్టుగా ఫ్రాన్స్‌ నిలిచింది. 2002 నుంచి నాలుగు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో కలిపి 6 గోల్స్‌ నమోదు కాగా... ఈ ఒక్క మ్యాచ్‌లోనే 6 గోల్స్‌ నమోదయ్యాయి. 1958 ఫైనల్‌ తర్వాత ఒకే మ్యాచ్‌లో 6 గోల్స్‌ నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి.

Story first published: Monday, July 16, 2018, 15:47 [IST]
Other articles published on Jul 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+