Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాప్ లేపిన రొనాల్డో, కోహ్లీ.. దూసుకొచ్చిన బుడ్డోడు!

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం అత్యధికంగా 76 దేశాల్లో రొనాల్డో గురించి నెటిజన్లు సెర్చ్ చేశారు. అతని విజయాలు, భారీ వాణిజ్య ఒప్పందాలు తరుచూ వార్తల్లో నిలిచేలా చేసాయి. నెలవారీ సగటు సెర్చ్ వాల్యూమ్‌లో కూడా రొనాల్డో 13.6 మిలియన్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

స్పెయిన్ ఫుట్‌బాల్ సెన్సేషన్, 18 ఏళ్ల లమిన్ యమల్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతని గురించి 37 దేశాల్లో అత్యధికంగా సెర్చ్ చేశారు. 16 దేశాలతో లియోనల్ మెస్సీ మూడో స్థానంలో నిలవగా.. అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ 8 దేశాలతో నాలుగో స్థానం, ఫార్మూలా 1 రేసర్ మాక్స్‌ వెర్‌స్టాపెన్ 6 దేశాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. నెలవారి సెర్చ్ పరంగా 13.6 మిలియన్లతో రొనాల్డో టాప్‌లో ఉండగా.. టెన్నిస్ త్రయం జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్, లమిన్ యమాల్‌లో ఒక్కొక్కర్ని సగటున 9.14 మిలియన్ల నెలవారి సెర్చ్ చేశారు.

Cristiano Ronaldo World s Most Searched Athlete in 2025 Virat Kohli Dominates Indian Searches

అగ్రస్థానంలో కోహ్లీ, సూర్య

భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. మరే ఇతర అంతర్జాతీయ క్రీడాకారుడు కూడా కోహ్లీని అందుకోలేకపోయారు. సెర్చ్ పాపులారిటీలో మరోసారి అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీ.. భారత అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్‌గా నిలిచాడు. భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ తర్వాత వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.

ఈ 14 ఏళ్ల కుర్రాడు విధ్వంసకర బ్యాటింగ్‌తో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన‌లు తర్వాతి స్థానంలో నిలిచారు. మహిళల వన్డే ప్రపంచకప్ విజయంతో ఈ ఇద్దరి పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే ఈ సెర్చ్‌ల వివరాలను గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ నెల ఆఖర్లో గూగుల్ ఈ లిస్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Story first published: Thursday, December 4, 2025, 16:48 [IST]
Other articles published on Dec 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+