Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యాట్రిక్ గోల్స్: రొనాల్డో ఖాతాలో అరుదైన రికార్డు

Cristiano Ronaldo equals European goals mark, tears up record book with hat trick

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి సోచీ నగరంలోని షిష్ట్ స్టేడియంలో పోర్చుగల్, స్పెయిన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మూడు గోల్స్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇరు జట్లు చెరో మూడు గోల్స్ చేయడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

Cristiano Ronaldo equals European goals mark, tears up record book with hat trick

అయితే, ఈ మ్యాచ్ పుట్ బాల్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. స్పెయిన్‌పై పోర్చుగల్ కెప్టెన్ రోనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు.

1
958036

ఆటలో భాగంగా స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి పోటాపోటీని ప్రదర్శించాయి. మ్యాచ్‌ ఆరంభమైన 4వ నిమిషంలోనే రొనాల్డో పెనాల్టీని గోల్‌ చేసి పోర్చుగల్‌కు శుభారంభం అందించాడు.

గోల్ కొట్టి మ్యాచ్ సమం చేసిన డిగో కోస్టా

ఆ తర్వాత స్పెయిన్‌ ఆటగాడు డిగో కోస్టా 24వ నిమిషంలో గోల్‌ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు. ఈ క్రమంలో రొనాల్డో మరింత దూకుడు ప్రదర్శించి 44వ నిమిషంలో మరో గోల్‌ అందించి మ్యాచ్‌ను 2-1 ఆధిక్యంలో తీసుకెళ్లాడు. అనంతరం 55వ నిమిషంలో స్పెయిన్‌ ఆటగాడు డిగో కోస్టా మరోసారి గోల్‌తో మెరిపించాడు.

58వ నిమిషంలో గోల్‌ కొట్టిన నాచో

ఆ తర్వాత నాచో 58వ నిమిషంలో గోల్‌ అందించి స్పెయిన్‌ ఆధిక్యాన్ని 3-2కు పెంచాడు. మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో రోనాల్డో చెలరేగిపోయాడు. 88వ నిమిషంలో ఫ్రీ కిక్‌తో గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాటు స్పెయిన్ ఆశలపై నీళ్లు చల్లాడు.

8వ నిమిషంలోనే తొలి గోల్‌

పోర్చుగల్‌ తరఫున 8వ నిమిషంలోనే తొలి గోల్‌ కొట్టిన రొనాల్డో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా నాలుగు వరల్డ్‌కప్‌లలో హ్యాట్రిక్ గోల్‌ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో(2006, 2010, 2014, 2018) చేరాడు. వరుసగా నాలుగు వరల్డ్‌కప్‌లలో హ్యాట్రిక్ గోల్‌ కొట్టిన ఘనత ఇప్పటివరకూ ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు.

v

అరుదైన జాబితాలో క్రిస్టియానో రొనాల్డో

ఈ జాబితాలో అందరికంటే ముందు జర్మనీ మాజీ ఆటగాడు యూ సీలర్‌ ఉన్నాడు. ఇతను వరుసగా 1958, 1962, 1966, 1970 వరల్డ్‌కప్‌ల్లో గోల్‌ కొట్టాడు. అతని తర్వాత బ్రెజిల్‌ మాజీ దిగ్గజ క్రికెటర్ పీలే ఉన్నాడు. మూడో స్థానంలో జర్మనీకే చెందిన మిరోస్లావ్‌ క్లోసే ఉన్నాడు. ఇతను 2002, 2006, 2010, 2014లో వరుసగా వరల్డ్‌కప్‌ల్లో గోల్‌ కొట్టాడు. తాజాగా వీరి జాబితాలోకి పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్ రొనాల్డో చేరాడు.

Story first published: Saturday, June 16, 2018, 15:09 [IST]
Other articles published on Jun 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+