Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్స్‌కు షాక్: ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తోన్న రొనాల్డో

Ronaldo Enjoys Family Holiday As Juventus Transfer Talks Continue
Cristiano Ronaldo enjoys family holiday as Juventus transfer talks continue

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో క్వార్టర్‌ ఫైనల్ చేరకుండానే పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో తన దేశానికి వరల్డ్ కప్ అందించాలనే క్రిస్టియానో రొనాల్డో కల.. కలగానే మిగిలింది. వరల్డ్ కప్‌ నాకౌట్‌లోనే ఇంటిముఖం పట్టడంతో కొంతకాలం రొనాల్డో అజ్ఞాతంలోకి వెళ్లడం ఖాయమని అనుకున్నారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

అయితే రొనాల్డో మాత్రం ఫ్యామిలీతో కలిసి సరదాగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తూ అభిమానులకు షాకిచ్చాడు. అంతేకాదు ఇటలీ క్లబ్ యువెంటస్ ట్రాన్స్‌ఫర్ కోసం ట్యూరిన్‌ సిటీలో ఉంటాడనుకున్న అభిమానుల అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రియురాలు జార్జినా రోడ్రిగ్వెజ్, జూనియర్ రొనాల్డోతో కలిసి దిగిన ఫోటోలను రొనాల్డో తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

క్లబ్ సాకర్‌ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమవ్వడానికి మరో రెండు వారాలు గ్యాప్ ఉండటంతో కుటుంబసభ్యులతో కలిసి రొనాల్డో విహారయాత్రకు వెళ్లాడు. గ్రూప్ దశలో 4 గోల్స్‌ కొట్టి పోర్చుగల్‌ను నాకౌట్‌కు చేర్చిన రొనాల్డో ఉరుగ్వేపై నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు. దీంతో వరల్డ్ కప్ షాక్ నుంచి రొనాల్డో కోలుకోవడం కష్టమని భావించారు.

అయితే, వరల్డ్ కప్ ఓటమిని తేలిగ్గా తీసుకున్న రొనాల్డో ఎప్పటిలానే కుటుంబసభ్యులతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తుంటే... మరోవైపు స్పానిష్ క్లబ్ అయిన రియల్ మ్యాడ్రిడ్ నుంచి యువెంటస్‌కు వెళ్లడం గ్యారంటీ అని పుట్‌బాల్ ప్రపంచంలో అభిమానులతో పాటు విశ్లేషకులు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.

Story first published: Tuesday, July 10, 2018, 19:08 [IST]
Other articles published on Jul 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+