Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కన్నీటి పర్యంతమైన క్రిస్టియానో రోనాల్డో (వీడియో)

ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. యూఈఎఫ్‌ఏ నేషన్స్ లీగ్ ఫైనల్లో స్పెయిన్‌ను ఓడించి పోర్చుగల్ విజేతగా నిలిచిన తర్వాత ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తూ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించడంతో క్రిస్టియానో రొనాల్డో తీవ్ర భాగోద్వేగానికి గురయ్యాడు.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ షూటౌట్‌లో 5-3తో స్పెయిన్‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 40 ఏళ్ల రొనాల్డో అద్వితీయమైన ప్రదర్శనతో పోర్చుగల్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2-2తో సమంగా నిలవగా అదనపు సమయాన్ని కేటాయించారు. అయినా ఫలితం రాకపోవడంతో షూటౌట్ ఆడించారు.

Cristiano Ronaldo cries like a Baby as Portugal win UEFA Nations League

ఈ మ్యాచ్‌ ఆరంభంలో స్పెయిన్ ప్లేయర్ మార్టిన్ జబిమెండీ 21వ నిమిషంలో గోల్ చేసి ఖాతా తెరిచాడు. అయితే 26వ నిమిషంలోనే నునో మెండీస్ గోల్ కొట్టి 1-1తో సమం చేశాడు. 45వ నిమిషంలో మైకెల్ కొట్టిన గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అయితే 61వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో గోల్ కొట్టి 2-2తో లెక్క సరి చేశాడు. దాంతో పోర్చుగల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా గోల్ నమోదు కాలేదు. షూటౌట్‌లో పోర్చుగల్ 5-3తో స్పెయిన్‌ను ఓడించి 6 ఏళ్ల తర్వాత టైటిల్ సొంతం చేసుకుంది.

షూటౌట్‌ సమయంలో రోనాల్డో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దేవుడిని ప్రార్థిస్తూ కనిపించాడు. ఆఖరి ప్రయత్నం వరకు ఉత్కంఠగా సాగిన షూటౌట్‌లో పోర్చుగల్ గోల్‌ కీపర్ డియోగో కోస్టా అద్భుతమైన సేవ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ప్రయత్నంలో నెవెస్ నెర్వ్‌లెస్‌ గోల్ కొట్టిన పోర్చుగల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. షూటౌట్‌కు రొనాల్డో దూరంగా ఉండటం గమనార్హం.

పోర్చుగల్ విజయం లాంఛనం పూర్తయిన తర్వాత రొనాల్డో ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మైదానం కుప్పకూలి కన్నీటి పర్యంతమయ్యాడు. రొనాల్డో అచ్చం విరాట్ కోహ్లీ తరహాలోనే భావోద్వేగానికి గురయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో టైటిల్ గెలిచిన అనంతరం కోహ్లీ కూడా కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం క్రిస్టియానో రొనాల్డోపై పోర్చుగల్ కోచ్ మార్టినెజ్ ప్రశంసల జల్లు కురిపించాడు. దేశం గర్వపడేలా రోనాల్డో ఆడాడని కొనియాడాడు.

షూటౌట్‌లో పోర్చుగల్

రూబెన్ డయాస్ - గోల్
విటీన్హా - గోల్
బ్రూనో ఫెర్నాండెజ్ - గోల్
నునో మెండెస్-గోల్
నెవెస్ నెర్వ్‌లెస్‌- గోల్

షూటౌట్‌లో పోర్చుగల్ స్పెయిన్

మిగెల్ మెరినో - గోల్
అలెక్స్ బేనా - గోల్
ఇస్కో - గోల్
అల్వారో మొరాటా-విఫలం (అడ్డుకున్న పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా)

FAQs
MyKhel Sports
Story first published: Monday, June 9, 2025, 13:23 [IST]
Other articles published on Jun 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+