Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘నీ స్వార్థమే జట్టును ముంచింది’.. లైవ్‌లోనే రొనాల్డోను తిట్టిన ఫ్రాన్స్ దిగ్గజం

ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో బలహీనమైన డీఆర్ కాంగో జట్టుతో పోర్చుగల్ 1-1తో డ్రా చేసుకోవడం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం, 41 ఏళ్ల రొనాల్డో జట్టు విజయం కంటే తన వ్యక్తిగత రికార్డులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే పాత విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

తానే గోల్ కొట్టాలని..

ఫ్రాన్స్ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ థియరీ హెన్రీ రొనాల్డోపై ఘాటు విమర్శలు చేశాడు. మ్యాచ్ సెకండాఫ్‌లో పెనాల్టీ ఏరియా వద్ద రొనాల్డో కదలికలను విశ్లేషిస్తూ హెన్రీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'ఆ సమయంలో రొనాల్డో కాస్త పక్కకు జరిగి ఉంటే.. డిఫెండర్లు అతని వెనుక వెళ్లేవారు.

అప్పుడు బ్రూనో ఫెర్నాండెజ్‌కు సులువుగా గోల్ కొట్టే అవకాశం దక్కేది. కానీ రొనాల్డో తానే గోల్ చేయాలనే ఉద్దేశంతో బ్రూనో దారికి అడ్డుగా వెళ్లాడు. ఇక్కడ జట్టు స్కోర్ చేయడం ముఖ్యం, నువ్వు (రొనాల్డో) మాత్రమే స్కోర్ చేయడం కాదు' అంటూ హెన్రీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

The Team Needs To Score Not You Cristiano Ronaldo Blasted by Thierry Henry After Portugal s Shock Draw Against DR Congo

జట్టుకు భారంగా..

ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ పూర్తి ఆధిపత్యం చెలాయించినప్పటికీ గోల్స్‌ సాధించడంలో విఫలమైంది. ఇక 90 నిమిషాల పాటు మైదానంలో ఉన్న రొనాల్డో కనీసం ఒక్క షాట్ కూడా టార్గెట్‌ వైపు కొట్టలేకపోయాడు. కేవలం 25 సార్లు మాత్రమే బంతిని తాకాడు. బ్రూనో ఫెర్నాండెజ్, జోనో నెవెస్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ.. పోర్చుగల్ అటాకింగ్ ఇప్పటికీ రొనాల్డో చుట్టూనే తిరగడం జట్టుకు భారంగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

FIFA WC 2026: రొనాల్డోకు బిగ్ షాక్.. పసికూన చేతిలో చిక్కుకున్న పోర్చుగల్!

FIFA WC 2026: రొనాల్డోకు బిగ్ షాక్.. పసికూన చేతిలో చిక్కుకున్న పోర్చుగల్!

రొనాల్డోకు ఈ మ్యాచ్ మరింత చేదు జ్ఞాపకంగా మిగిలింది. అంతకుముందు రోజే అతని సమకాలీన ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ అర్జెంటీనా తరఫున హ్యాట్రిక్ గోల్స్ సాధించి తమ జట్టును గెలిపించాడు. దాంతో ఇద్దరి మధ్య పోలికలు మళ్లీ మొదలయ్యాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కాంగో అభిమానులు రొనాల్డోను చూస్తూ 'మెస్సీ.. మెస్సీ..' అంటూ నినాదాలు చేయడం అతడిని మరింత నిరాశకు గురిచేసింది.

41 ఏళ్ల వయసులో ఆడుతున్నా..

41 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచకప్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించినప్పటికీ, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అతను జట్టుకు బలంగా మారాడా లేక బలహీనతగా మారాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రొనాల్డో ఫామ్‌లోకి వచ్చి పోర్చుగల్‌ను గెలిపిస్తాడో లేదో చూడాలి.

FIFA World Cup 2026: తల్లి ప్రేమకు తలొగ్గిన అమెరికా!

FIFA World Cup 2026: తల్లి ప్రేమకు తలొగ్గిన అమెరికా!
Story first published: Thursday, June 18, 2026, 15:23 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+