Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రిస్టియానో రొనాల్డో ‘సెంచరీ’ కొట్టేశాడు.!

Cristiano Ronaldo became the first European to score 100 international goals

సోల్నా : దిగ్గజ ఫుట్‌బాలర్‌, పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో 100 అంతర్జాతీయ గోల్స్‌ క్లబ్‌లో చేరాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న తొలి యూరప్‌ ప్లేయర్‌గా, ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ (యూఈఎఫ్‌ఏ) నేషన్స్‌ లీగ్‌ టోర్నీలో భాగంగా గ్రూప్‌ '3' లీగ్‌ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 2-0 తో స్వీడన్‌ను ఓడించింది. 35 ఏళ్ల రొనాల్డో ఆట 45వ నిమిషంలో గోల్‌ చేయడంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో 100వ గోల్‌ మైలురాయి అందుకున్నాడు.

ఆ తర్వాత 73వ నిమిషంలో ఈ పోర్చుగల్ స్టార్ రెండో గోల్‌ కూడా చేసి తమ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గోల్‌తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్‌ సంఖ్య 101కు చేరింది. అంతర్జాతీయస్థాయిలో అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు అలీ దాయి (ఇరాన్‌) పేరిట ఉంది. 2006లో రిటైరైన 51 ఏళ్ల అలీ దాయి ఇరాన్‌ తరఫున మొత్తం 109 గోల్స్‌ సాధించాడు.

2003లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోకి అరంగేట్రం చేసిన రొనాల్డో ఇప్పటి వరకు పోర్చుగల్‌ తరఫున 165 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 41 దేశాలపై కనీసం ఒక గోల్‌ అయినా చేశాడు. లిథువేనియా, స్వీడన్‌ దేశాలపై ఈ స్టార్ ఫుట్ బాలర్ అత్యధికంగా ఏడు గోల్స్‌ చొప్పున చేశాడు. రొనాల్డో తాను చేసిన మొత్తం 101 గోల్స్‌లో 41 గోల్స్‌ మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో... 60 గోల్స్‌ రెండో అర్ధ భాగంలో సాధించాడు. ఓవరాల్‌గా రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌లో 9 సార్లు 'హ్యాట్రిక్‌' సాధించాడు.

రొనాల్డో గోల్‌ చేసిన మ్యాచ్‌ల్లో పోర్చుగల్‌ 55 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. ఐదు మ్యాచ్‌లను 'డ్రా' చేసుకుంది. ప్రొఫెషనల్‌ కెరీర్‌లో (స్పోర్టింగ్‌ క్లబ్, మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్, రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్, యువెం టస్‌ క్లబ్‌) రొనాల్డో మొత్తం 447 గోల్స్‌ చేశాడు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 109 గోల్స్‌తో అలీ దాయి (ఇరాన్‌), రొనాల్డో(101) టాప్-2లో ఉండగా.. హంగరీ స్టార్ ఫెరెన్స్ పుస్కాస్(84), జాంబియా ఆటగాడు గాడ్‌ఫ్రే(79), ఇరాక్ ప్లేయర్ హుస్సెన్ సయీద్(78) వరసగా టాప్-5లో ఉన్నారు. భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ 72 గోల్స్‌తో టాప్-10 ఉండగా.. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ 70 గోల్స్‌తో 15వ స్థానంలో ఉన్నాడు.

Story first published: Thursday, September 10, 2020, 10:07 [IST]
Other articles published on Sep 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+