Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లికి ముందే రొనాల్డో-జార్జినా ఇడుపు కాయితం!

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తన ప్రియురాలు మోడల్ జార్జినా రోడ్రిగ్స్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది.

తాజాగా ఈ పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అయితే పెళ్లికి ముందే ఈ ఇద్దరూ స్పషంగా ఇడుపు కాయితం రాసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరువురి ఆస్తుల విషయంలో స్పష్టమైన విభజన చేసుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.

Cristiano Ronaldo and Georgina Rodriguez Get Married Financial Details of Prenuptial Agreement Emerge

ఎవరి ఆస్తులు వారివే..

పెళ్లితో ఒక్కటైనా.. ఎవరి ఆస్తులు వారి నియంత్రణలోనే ఉండేట్లు ఒప్పంద పత్రం రాసుకున్నట్లు తెలుస్తోంది. ఒకరి ఆస్తుల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనే నిబంధన పెట్టుకున్నారంట. భవిష్యత్తులో అనివార్య కారణాలతో విడిపోయినా.. ఎలాంటి సమస్య రావద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్‌లు, యాడ్ బిజినెస్ వెంచర్స్, సీఆర్7 హోటల్ చెయిన్ నుంచి వచ్చే ఆదాయంతో పాటు ఆయా లీగ్స్ ఆడటం ద్వారా అందుకునే వేతనంపై సర్వహక్కులు క్రిస్టియన్ రొనాల్డోకే ఉంటాయి. జార్జినాకు ఎలాంటి హక్కులు ఉండవు.

ఫిఫా ప్రపంచ కప్ వేళ రొనాల్డో సంచలన నిర్ణయం!

ఫిఫా ప్రపంచ కప్ వేళ రొనాల్డో సంచలన నిర్ణయం!

రెండు నిబంధనలతో ఇడుపు కాయితం..

ఒకవేళ భవిష్యత్తులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే అమల్లోకి వచ్చే రూల్స్‌ను కూడా వివాహ నమోదు పత్రంలో పేర్కొన్నట్లు పోర్చుగీస్ పత్రిక పేర్కింది. విడిపోతే రొనాల్డో నుంచి జార్జినాకు రూ.1.10 కోట్లు భరణం ఇవ్వాలనేది తొలి నిబంధన కాగా.. మాడ్రిడ్‌లోని లగ్జరీ మాన్షన్ లా ఫిన్సా బిల్గింగ్‌పైనా జార్జినాకు యాజమన్య హక్కులు ఉండేలా రెండో రూల్‌గా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ బిల్డింగ్ విలువ ప్రస్తుతం రూ.53.30 కోట్లు. రొనాల్డోకు చెందిన ఇతర ఆస్తుల్లో ఎలాంటి వాటా కూడా జార్జినాకు రాదని సదరు రిపోర్ట్ వెల్లడించింది.

ఎవరీ బ్యూటీఫుల్ ట్విన్ సిస్టర్స్? ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రేజీ సీన్! (వీడియో)

Also Read

ఎవరీ బ్యూటీఫుల్ ట్విన్ సిస్టర్స్? ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రేజీ సీన్! (వీడియో)

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. భారీ రిసెప్షన్ నిర్వహించేందుకు రొనాల్డో-జార్జినా ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేలాది మంది అభిమానులు, మీడియా ప్రతినిధుల కోసం మాడైరా ప్రాంతంలో రిసెప్షన్ పెట్టాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఈ రిసెప్షన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Story first published: Friday, August 14, 2026, 18:23 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+