Fifa World Cup 2026: అదిరిపోయే ఆరంభం.. ఉర్రూతలూగించిన షకీరా! (వీడియో)
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను అలరించేందుకు ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీకి గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం అర్ధరాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి. ఆతిథ్య మెక్సికో సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేడుక జరిగింది.
కొలంబియా పాప్ సింగర్ షకీరా తన గాత్రంతో ఇస్టాడియో అజ్‌టెకా స్టేడియాన్ని ఉర్రతలూగించింది. ఆమెతో పాటు నైజీరియా సింగర్ బర్నా బాయ్ ప్రపంచకప్ అధికారిక గీతం డాయ్ డాయ్‌ను పాడి అభిమానులను అలరించారు. కొలంబియా గాయకుడు బాల్విన్‌తో పాటు పలువురు గాయకులు తమ పాటలతో అభిమానులను ఆకట్టుకున్నారు.

కళాకారుల సంప్రదాయ నృత్యాలతో ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ భారీ నమూనాను మైదానంలో ప్రదర్శించగా.. ఆ సమయంలో బాణా సంచా మోతతో స్టేడియంలో మరో ప్రపంచం ఆవిష్కృతమైంది. ఆరంభ వేడులకను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరాగా.. కళాకారుల విన్యాసాలు కట్టిపడేశాయి. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఫిఫా అధ్యక్షుడు గియానీ మాట్లాడుతూ.. ప్రశాంతంగా సేదతీరుతూ ఆస్వాదించండని అభిమానులకు పిలుపునిచ్చాడు. 2010 ప్రపంచకప్ తరహాలోనే మెక్సికో-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌తోనే 2026 ప్రపంచకప్ ప్రారంభమైంది.
ఈ ప్రపంచకప్‌లో ఇంకో రెండు సార్లు ఆరంభవేడుకలు జరగనున్నాయి. కెనడా, అమెరికా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లకు ముందు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కెనడాలోని టొరంటోలో శుక్రవారం, అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో శనివారం ఈ వేడుకలు జరుగుతాయి. కెనడాలో ఆరంభ వేడుకల తర్వాత కెనడా, బోస్నియా అండ్ హెర్జెగోవినా తలపడనుండగా.. అమెరికాలో సెలెబ్రేషన్స్ తర్వాత యూఎస్-పరాగ్వే ఆడనున్నాయి.
మెక్సికో శుభారంభం
ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య మెక్సికో టీమ్ శుభారంభం చేసింది. ఆరంభ వేడుకల అనంతరం హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో టీమ్ 2-0తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన కంటే.. ఇరు జట్లకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు రెడ్ కార్డ్స్‌తో మైదానం వీడటం చర్చనీయాంశమైంది.
నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ రెడ్ కార్డులు ఇచ్చాడు. వీరిలో ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కాగా.. ఒకరు మెక్సికన్ ప్లేయర్ ఉన్నారు. రెడ్ కార్డు ప్రభావంతో 9 మందితోనే దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆడి మూల్యం చెల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

