For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్‌కప్ ఫైనల్లో విజయం మాదే: ధీమా వ్యక్తం చేసిన ఫ్రాన్స్ కోచ్

By Nageshwara Rao
Coach Didier Deschamps hails players as France head to 2018 World Cup final

హైదరాబాద్: "చెప్పలేనంత సంతోషానికి గురవుతున్నా" అని ఫ్రాన్స్ కోచ్ డిడెర్ డెస్‌చాంప్స్ పేర్కొన్నాడు. రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్లో బెల్జియంపై అద్భుత విజయాన్ని సాధించి ఫ్రాన్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ జట్టు కోచ్ మాట్లాడుతూ "బెల్జియంపై అపూర్వ విజయంతో ఫిఫా ఫుట్‌బాల్ ఫైనల్‌కు చేరడంపట్ల నేను, జట్టు మొత్తం సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకునేది లేదు. 2016 యూరోలో ప్రదర్శించిన ఆట ప్రావీణ్యం కంటే మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తాం" అని అన్నారు.

పారిస్‌లో జరిగిన 2016 యూరో క్లబ్‌లో పోర్చుగల్ చేతిలో ఫ్రాన్స్ 2-0 స్కోరుతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో లుజ్నికి స్టేడియంలో జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో విజయం ఫ్రాన్స్‌దేనని చెప్పుకొచ్చారు. "పైనల్లో మాదే విజయం. ఇందులో ఎలాంటి సదేహాలు లేవు. జట్టు పటిష్టంగా ఉంది" అని కోచ్ డిడెర్ డెస్‌చాంప్స్ తెలిపాడు.

ఫ్రాన్స్ ఆటగాడు శామ్యూల్ ఉమ్టిటి సాధించిన హెడర్‌ గోల్‌తో బెల్జియం జట్టుపై ఫ్రాన్స్ విజయం సాధించి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. "నిజానికి బెల్జియంను నియంత్రించడం అంత సులువు కాదు. అందుకే నా సిబ్బందికి, జట్టు ఆటగాళ్లకు హ్యాట్సాఫ్" అని ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆదివారం జరిగే ఫైనల్లో క్రొయేషియా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది. 1998 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌ చేరుకోవడమే క్రొయేషియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. దీంతో ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరిన చిన్నదేశంగా (జనాభా పరంగా) క్రొయేషియా నిలిచింది. క్రొయేషియా దేశ జనాభా ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

క్రొయేషియా జనాభా సుమారు నలభై లక్షలు. అంటే మన దేశంలో మిజోరం-నాగాలాండ్‌ ఈ రెండు రాష్ట్రాలను కలిపితే ఉన్న జనాభా కంటే క్రొయేషియా దేశ జనాభానే తక్కువ. ఒక్క హిమాచల్‌ ప్రదేశ్‌(68.6లక్షలు) రాష్ట్రంతో పోల్చి చూసినా క్రొయేషియా జనాభా తక్కువే. దీంతో 1950లో వరల్డ్‌కప్ ఫైనల్‌ చేరిన చిన్న దేశంగా ఉరుగ్వే చరిత్ర సృష్టించింది.

ఆ తర్వాత అంటే 68 ఏళ్ల తర్వాత 2018 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌ చేరిన చిన్న దేశంగా క్రొయేషియా చరిత్ర సృష్టించింది. అంతేకాదు తక్కువ ర్యాంకులో ఉన్న ఓ జట్టు ఫైనల్‌ చేరడం ఫిఫా చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం క్రొయేషియా ర్యాంకు 20గా ఉంది. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ వరల్డ్ కప్ బరిలోకి దిగిన క్రొయేషియా తన సంచలన ప్రదర్శనతో వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది.

Story first published: Thursday, July 12, 2018, 17:26 [IST]
Other articles published on Jul 12, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+