Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కిందపడ్డ కోచ్: బ్రెజిల్ ఆటగాళ్లు కొట్టిన గోల్ ఎంత పని చేసింది? (వీడియో)

Brazils coach celebrated stoppage time goal so hard he fell down

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నీలో భాగంగా శుక్రవారం బ్రెజిల్‌-కోస్టారికా జట్లు పోటీ పడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. నాకౌట్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ కొట్టి బ్రెజిల్ విజయం సాధించింది.

మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందేమో అనిపించిన తరుణంలో ఆట 89వ నిమిషంలో నేమార్‌ క్రాస్‌ షాట్‌ను అందుకునే క్రమంలో కోస్టారికా కీపర్‌ నెవాస్‌ గాయపడ్డాడు. దీంతో ఏడు నిమిషాలపాటు ఇంజ్యూరీ సమయం ఇవ్వడంతో 90+1లోనే బ్రెజిల్‌ సూపర్‌ గోల్‌తో బ్రెజిల్ తొలి గోల్ నమోదు చేసింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

లెఫ్ట్‌ ఫ్లాంక్‌ నుంచి మార్సెలో క్రాస్‌ షాట్‌ను అందుకున్న ఫిర్మినో ముందుగా బంతిని ఇన్‌సైడ్‌ బాక్స్‌లో కిందికి దించగా జీసస్‌ గోల్‌ కోసం ప్రయత్నించాడు. అయితే అతడు సరిగ్గా టచ్‌ చేయకపోగా మెరుపు వేగంతో స్పందించిన కౌటినో వెంటనే బంతిని కీపర్‌ కాళ్ల సందులోంచి ప్రత్యర్ధి గోల్ పోస్టులోకి పంపడంతో బ్రెజిల్‌ తొలి గోల్ సాధించింది.

1
958049

దీంతో ఒక్కసారిగా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అలాగే మైదానం వెలుపల ఉన్న ఆటగాళ్లు, ఆ జట్టు కోచ్‌ టైట్‌ ఆనందానికి అవధుల్లేవు. ఈ క్రమంలో మైదానం వెలుపల ఉన్న ఆటగాళ్లు, టైట్‌ సంబరాలు చేసుకునేందుకు మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనుకోకుండా వెనుక ఉన్న ఆటగాడు టైట్‌ను తోసేశాడు.

దీంతో బ్రెజిల్ కోచ్ టైట్‌ కింద పడిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న ఆటగాళ్లు టైట్‌ను పైకి లేపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ అనంతరం టైట్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా కుడి చేతి భుజానికి స్వల్ప గాయమైనట్లు పరీక్షల్లో తేలింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు.

ఆ తర్వాత ఆట కొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా నేమార్‌ (90+7) ప్రత్యర్ధి గోల్‌ పోస్టుకు ఆరు గజాల దూరం నుంచి కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బ్రెజిల్‌కు రెండో గోల్‌ అందించాడు. ఈ గోల్ కొట్టిన అనంతరం నేమార్ ఆనందంలో కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో బ్రెజిల్‌ 2-0తో విజయం సాధించగా.. వరుసగా రెండు ఓటములతో కోస్టారికా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Story first published: Saturday, June 23, 2018, 14:26 [IST]
Other articles published on Jun 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+