For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుట్‌ బాల్ దిగ్గజం పీలేకు కన్నీటి వీడ్కోలు!

Brazil bids farewell to soccer legend Pele

శాంటోస్‌: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలేకు అభిమాన లోకం కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రజలు సందర్శనార్థం పీలే పార్థివ దేహాన్ని విలా బెల్మిరో స్టేడియంలో ఒక రోజు ఉంచిన అనంతరం మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. సాకర్ లెజెండ్‌ను కడసారి చూసేందుకు శాంటోస్‌లో అభిమానులు భారీగా తరలి వచ్చారు.

బ్రెజిల్ జాతీయ జెండా, శాంటోస్ క్లబ్ జెండా కప్పిన పీలే భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో విలా బెల్మిరో స్టేడియం నుంచి అతను పుట్టి, పెరిగిన శాంటోస్ వీదుల గుండా ఊరేగించారు. కొన్ని గంటల పాటు సాగిన అంతిమ యాత్రలో వేలాది మంది ఫ్యాన్స్ పాల్గొన్నారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డిసిల్వా సహా వేల మంది స్మశాన వాటిక వరకు అంతిమ యాత్రలో పాల్గొని ఫుట్‌బాల్‌ మేటికి కన్నీటి వీడ్కోలు పలికారు.

సుదీర్ఘ కాలంగా పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడ్డ పీలే(82) గత గురువారం అర్థరాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌ బారిన పడ్డ పీలేకు గతేడాది సెప్టెంబర్‌లో వైద్యులు పెద్ద పేగులో క్యాన్సర్‌ కణితిని తొలగించారు. అప్పటి నుంచి ఆయనకు కీమోథెరపీ చికిత్స అందించారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో పలు అవయవాలు పనిచేయకపోవడంతో పీలే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

Brazil bids farewell to soccer legend Pele

1940 అక్టోబర్‌ 24న జన్మించిన పీలే తన మంత్ర ముగ్ధమైన ఆటతీరుతో సాకర్‌ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడిగా వెలుగొందాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లలో బ్రెజిల్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీలే.. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మూడు ప్రపంచకప్‌లు అందుకున్న ఏకైక వ్యక్తిగా పీలే నిలిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా పేరు లిఖించుకున్న పీలే.. 16 ఏళ్ల ప్రాయంలోనే బ్రెజిల్‌ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

Brazil bids farewell to soccer legend Pele

92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్‌ చేసి జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన వ్యక్తిగా నిలిచాడు. 1956 నుంచి 1974 వరకు బ్రెజిలియన్‌ క్లబ్‌ శాంటోస్‌ తరఫున బరిలోకి దిగిన పీలే 659 మ్యాచ్‌ల్లో 643 గోల్స్‌ చేశాడు. 1961, 1962, 1963, 1964, 1965, 1968లో ఆరుసార్లు తన క్లబ్‌కు బ్రెజిల్‌ లీగ్‌ టైటిల్‌ను అందించాడు. ఇక తన కెరీర్‌ చరమాంకంలో న్యూయార్స్‌ కాస్మోస్‌ తరఫున రెండేళ్లు యూఎస్‌లో ఫుట్‌బాల్‌ ఆడాడు. మరో దిగ్గజ ఆటగాడు, అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనాతో కలిపి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది సెంచరీ' అవార్డును పీలే అందుకున్నాడు.

Story first published: Wednesday, January 4, 2023, 10:51 [IST]
Other articles published on Jan 4, 2023
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+