
సెవిల్లె (స్పెయిన్): యూరో కప్ 2020 ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ జట్టు కథ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెల్జియం 1-0 గోల్ తేడాతో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ఆట 42వ నిమిషంలో ఎడెన్ హజార్డ్ గోల్‌తో బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఒక్క గోల్ కూడా చేయకుండా నిరాశపర్చాడు. రొనాల్డో ఒక గోల్ చేసినట్టయితే (110) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పేవాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇటలీతో బెల్జియం ఆడుతుంది.