For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనుకోని అతిథిగా ‘కంగారూ’: అరగంటసేపు మ్యాచ్‌కు అంతరాయం (వీడియో)

By Nageshwara Rao
Australian football match held up for 32 minutes as rampaging kangaroo repeatedly invades pitch

హైదరాబాద్: పుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలోకి కంగారు అనుకోని అతిథిలా రావడంతో మ్యాచ్‌కు అరగంటసేపు అంతరాయం కలిగించింది. ఈ సంఘటన ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెరాలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానిక మహిళా జట్లు క్యాపిటల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌-బెల్కోనెన్‌ యునైటెడ్‌ల మ్యాచ్‌ జరిగింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆట తొలి అర్ధభాగం ముగిసిన తర్వాత మహిళా క్రీడాకారిణులంతా విరామం తీసుకునేందుకు వెళ్లారు. విరామ సమయం ముగిసిన తర్వాత క్రీడాకారిణులంతా మైదానంలోకి వచ్చే సరికి ఆరడుగులు ఉన్న ఓ కంగారూ దర్జాగా కూర్చొని ఉంది. దానంతట అదే వెళ్లుపోతుందేమోనని కొద్దిసేపు ఎదురు చూశారు.

అయితే, కంగారూ మాత్రం అలాగే మైదానంలోనే కూర్చుని ఉంది. దీంతో ఓ క్రీడాకారిణి తన చేతిలోని పుట్‌బాల్‌ను దానివైపుకి విసిరింది. దాంతో అది అక్కడినుంచి లేచి మైదానంలో పరుగులు ప్రారంభించిందే తప్ప బయటకు వెళ్లలేదు. అలా, అరగంటకు పైగా క్రీడాకారిణులు, అధికారులను బయటకు వెళ్లకుండా పరుగులు పెట్టించించింది.

చివరకు, లాభంలేదనుకున్న టోర్నీ నిర్వాహకులు ఓ జీపును మైదానంలోకి తీసుకువచ్చి కంగారూని పరిగెత్తించడంతో ఎట్టకేలకు అది బయటకు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Tuesday, June 26, 2018, 13:01 [IST]
Other articles published on Jun 26, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+