55 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌లో భారత విజయం, మెస్సీని దాటేసిన ఛెత్రి

అబుదాబి: స్టార్ స్ట్రయికర్ కెప్టెన్ సునీల్ చెత్రి (27వ, 46వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగడంతో ఆసియా కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. గోల్స్ పరంగా ఆసియా కప్ చరిత్రలో భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నీలో అడుగుపెట్టిన భారత్ 1964 తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్‌తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయంలో ఛెత్రిదే కీలకపాత్ర. కెప్టెన్ చెత్రి రెండు గోల్స్ చేయగా... అనిరుధ్ థాపా (68వ ని.లో), జెజె లాల్‌పెఖుల (80వ ని.లో) చెరో గోల్ చేశారు. థాయ్‌లాండ్ తరఫున తీరాసిల్ దంగ్డా (33వ ని.లో) ఏకైక గోల్ చేశాడు.

బంతి తగలడంతో భారత్‌కు పెనాల్టీ
27వ నిమిషంలో గోల్‌పోస్ట్ సమీపంలో థాయ్ డిఫెండర్ చేతికి బంతి తగలడంతో రిఫరీ భారత్‌కు పెనాల్టీ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఛెత్రి గోల్‌గా మలిచి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని చెత్రి గోల్‌గా మలచడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. మరో 6 నిమిషాల్లోనే థాయ్‌లాండ్ తరఫున తీరాసిల్ దంగ్డా గోల్ కొట్టడంతో స్కోరు 1-1తో సమం అయింది. రెండో అర్ధభాగం ప్రారంభ నిమిషంలోనే సునీల్ చెత్రి మెరుపు వేగంతో ఫీల్డ్ గోల్ చేసి భారత్‌కు 2-1తో ఆధిక్యం అందించాడు.
ప్రొ కబడ్డీ 2018 విజేతగా నిలిచిన బెంగళూరు బుల్స్

మరోసారి మాయ చేసిన సునీల్ ఛెత్రి
సునీల్ ఛెత్రి (46వ ని) మరోసారి మాయ చేశాడు. ఉదంతా నుంచి క్రాస్‌ను అందుకున్న ఛెత్రి.. మెరుపు వేగంతో గోల్ చేసేశాడు. థాయ్‌లాండ్ కూడా గోల్స్ కోసం బాగానే ప్రయత్నించినా భారత గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆధిక్యాన్ని కొనసాగించిన భారత్ ప్రత్యర్థిపై దాడులు మరింత ఉధృతం చేసింది. ఆ తర్వాత అనిరుధ్, జెజె లాల్‌పెఖుల గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యంతో భారత్ మ్యాచ్‌ను ముగించింది. ఫలితంగా 68వ నిమిషంలో అనిరుధ్ థాపా గోల్ చేయడంతో భారత్ 3-1తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్ కాసేపట్లో ముగుస్తుందనగా జెజె (80వ ని) మరో గోల్ కొట్టి భారత విజయాన్ని ఖాయం చేశాడు.

మెస్సీని దాటేసిన సునీల్ చెత్రి
1964 తర్వాత ఆసియా కప్‌లో ఒక మ్యాచ్ గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఈ టోర్నీలో ఆడిన 11 మ్యాచ్‌ల్లో మన జట్టుకు ఇది మూడో విజయం మాత్రమే. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన సునీల్ చెత్రి (66 గోల్స్) అంతర్జాతీయస్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ప్రస్తుత క్రీడాకారుల జాబితాలో లియోనెల్ మెస్సీని (అర్జెంటీనా-65 గోల్స్) వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్-85 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఒక్కటి డ్రా అయినా.. ప్రిక్వార్టర్ ఫైనల్‌కు భారత్
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అనూహ్యంగా ఓడిపోయింది. గ్రూప్-బి తొలి మ్యాచ్‌లో జోర్డాన్ 1-0తో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను అనస్ బనీ యాసీన్ (26వ ని.లో) చేశాడు. తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ 10న ఆతిథ్య యూఏఈతో... 14న బహ్రెయిన్‌తో ఆడనుంది. ఈ రెండింటిలో ఒక దానిని ‘డ్రా' చేసుకున్నా భారత్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications