ప్రొ కబడ్డీ 2018 విజేతగా నిలిచిన బెంగళూరు బుల్స్

ముంబై: ప్రొ కబడ్డీ ఆరో సీజన్‌కు అసలు సిసలైన ముగింపు లభించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఫైనల్లో విజయం సాధించిన బెంగళూరు బుల్స్ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. శనివారం హోరా హోరీగా సాగిన తుదిపోరులో బెంగళూరు 38-33తో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌ను ఓడించింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా గుజరాత్ రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు. త సీజన్ ఫైనల్లో గుజరాత్.. పట్నా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో బుల్స్‌ను విజయ తీరాలకు చేర్చడంలో స్టార్ రైడర్ పవన్ (25) ప్రధాన పాత్ర పోషించాడు.
రెండు జట్ల ఆటగాళ్లు పాయింట్లు
సచిన్ (10), ప్రపంజన్ (5) రాణించడంతో గుజరాత్ 16-9 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత కూడా ఆ జట్టు వరుస పాయింట్లు సాధించి ఓ దశలో 19-14తో నిలిచింది. దాంతో బెంగళూరు ఓడిపోయేలా కనిపించింది. కానీ అప్పుడే పవన్ మాయ మొదలైంది. సూపర్ రైడ్‌లతో విరుచుకుపడిన అతను జట్టు స్కోరును పెంచాడు. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి బెంగళూరు మరో పది నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 23-22తో తొలిసారి ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం పోరాడడంతో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది.
నాలుగు నిమిషాల ఆట 29-29తో
మరో నాలుగు నిమిషాల ఆట మాత్రమే ఉందనగా స్కోరు 29-29తో సమమైంది. ఆ దశలో పవన్ మళ్లీ విజృంభించాడు. వరుసగా పాయింట్లు తెచ్చి గుజరాత్‌ను మరోసారి ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో చివరి రెండు నిమిషాల ఆట ఉందనగా 36-29తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బెంగళూరు చివరకు మ్యాచ్ సొంతం చేసుకుంది.
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును పవన్
ఇక, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును పవన్ కుమార్ (బెంగళూర్) దక్కించుకున్నాడు. రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ప్రదీప్ నర్వాల్ (పట్నా) దక్కించుకోగా డిఫెండర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును నితీష్ కుమార్ (యూపీ యోధ) సొంతం చేసుకున్నాడు. పవన్ షెరావత్. ఈ సీజన్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన రైడర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పవన్ ఫైనల్లో అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. వెనకబడ్డ జట్టును ముందుకు నడిపి చివరకు విజయాన్ని అందించాడు.
విజేతకు రూ. 3 కోట్లు, రన్నరప్‌కు రూ. 1లక్ష 80 వేలు
మ్యాచ్ ఆరంభం నుంచి రెండు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. విజేతగా నిలిచిన బెంగళూరుకు రూ. 3 కోట్లు, గుజరాత్‌కు రూ. 1లక్షా 80 వేల ప్రైజ్‌మనీ లభించింది. ఏడో అంచె పీకేఎల్ జూలైలో మొదలుకానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications