Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీ నాకు ఫీజు చెల్లించాలి: ఫ్లై బాయ్‌ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్ర

Anand Mahindra on Twitter: Messi will have to pay me a fee

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో నాకౌట్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్‌‌కు అర్హత సాధించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 14వ నిమిషంలో అద్బుత గోల్‌తో ఖాతా తెరిచి అర్జెంటీనాకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఈ గోల్‌పై ఇండియన్ కార్పొరేట్ దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు. తరచూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ పలు విషయాలను ఆనంద్ మహీంద్ర షేర్‌ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా, రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా-నైజీరియా మ్యాచ్ గురించి ఓ ట్వీట్ చేశారు. "ఈ వరల్డ్‌కప్‌ చూడటం ఓ అదృష్టంగా భావిస్తాను. ఎంతో ఉత్సాహంగా ఉన్న నేను నైజీరియాతో అర్జెంటీనా మ్యాచ్‌ చూస్తూ మధ్యలోనే చాలా అలసిపోయాను. బోర్‌ కొడుతుందని ఇక టీవీ ఆఫ్‌ చేద్దామని రిమోట్‌ అలా పట్టుకున్నానో లేదో అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సీ మ్యాజిక్‌ (గోల్‌) చేశాడు. రిమోట్‌ను చేతిలోకి తీసుకోవడం అలవాటుగా చేసుకుంటానని" అని ట్వీట్ చేశారు.

1
958042

మెస్సీ కొట్టిన గోల్‌కు ఓప్రత్యేకత ఉంది. ఇది టోర్నీలో 100వ గోల్ కావడం విశేషం. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధబాగంలో అనూహ్యంగా నైజీరియా నుంచి మెస్సీ బృందానికి గట్టి పోటీ ఎదురైంది. 49వ నిమిషంలో అర్జెంటినా ఆటగాడు జేవియర్ మస్చెరానో ఫౌల్‌ చేయడంతో నైజీరియాకు పెనాల్టీ లభించింది.

దీనిని సద్వినియోగం చేసుకున్న నైజీరియా ఆటగాడు విక్టర్ మోసెస్ తెలివిగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి గోల్ స్కోరుని సమం చేశాడు. అంతేకాదు ఫిఫా వరల్డ్ కప్‌లో పెనాల్టీగోల్‌ సాధించిన రెండో ఆటగాడిగా విక్టర్‌ మోసెస్‌ రికార్డు నమోదు చేశాడు. 2010 ప్రపంచకప్‌లో యాకుబ్‌ నెట్టెడ్‌ నైజీరియా తరపున తొలిసారి పెనాల్టీ గోల్‌ సాధించాడు.

ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ చేసేందుకు హోరాహోరాగా పోరాడుతున్నాయి. ఈ సమయంలో ఫ్లై బాయ్‌ అనే నెటిజన్‌ అర్జెంటీనా మరో గోల్ చేయాలనే ఉద్దేశ్యంతో "సార్‌.. మీ రిమోట్‌ టెక్నిక్‌ మరోసారి ప్రయోగించండి" అని ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌కు మెస్సీ నాకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆనంద్‌ మహీంద్ర చమత్కరిస్తూ రీట్వీట్‌ చేశారు.

Story first published: Wednesday, June 27, 2018, 11:01 [IST]
Other articles published on Jun 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+