న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వరల్డ్ కప్: మెస్సీ జట్టు ఓడిందని కేరళలో అభిమాని ఆత్మహత్య!

By Nageshwara Rao
After Argentina Loses Match, Kerala Fan Goes Missing, Leaves Suicide Note

హైదరాబాద్: అభిమానం శృతి మించింది. ఫిఫా వరల్డ్‌ కప్‌లో అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన కేరళలలో చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి అర్జెంటీనా-క్రోయేషియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 3-0 తేడాతో ఓడిపోయింది. క్రొయేషియా చేతిలో అర్జెంటీనా 0-3తో ఓడిపోవడాన్ని భరించలేక డీనూ అలెక్స్‌ అనే 30 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తోన్న డీనూ అలెక్స్‌

ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తోన్న డీనూ అలెక్స్‌

వివరాల్లోకి వెళితే కొట్టాయం జిల్లా అర్మనూర్‌ గ్రామానికి చెందిన 30 ఏళ్ల డీనూ అలెక్స్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. లియోనల్ మెస్సీకి వీరాభిమాని. అర్జెంటీనా-క్రొయేషియా మ్యాచ్‌‌ని టీవీలో వీక్షించిన అతడు ఈ మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో అర్జెంటీనా ఘోర పరాభవాన్ని చవిచూడడంతో అతను తట్టుకోలేకపోయాడు.

 ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా

ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా

దీంతో మనస్థాపం చెందిన డీనూ "నా ఫెవరెట్‌ జట్టు ఓడింది. మెస్సీ దారుణంగా నిరుత్సాహపరిచాడు. నాకు ఈ ప్రపంచంలో చూసేందుకు ఇంకా ఏం మిగల్లేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ" అంటూ మళయాళంలో ఓ లేఖ రాసి పెట్టి వెళ్లిపోయాడు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడి తల్లిదండ్రులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడి తల్లిదండ్రులు

శుక్రవారం ఉదయం నుంచి తమ కుమారుడు కనిపించకుండా పోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీనూ గదిలో అర్జెంటీనా జెర్సీ, పుస్తకాల్లో, గోడల మీద మెస్సీ ఫోటోలు, అభిమాన రాతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో ఆ చుట్టుపక్కల గాలింపు చేట్టారు.

సెర్చ్‌ ఆపరేషన్‌కు విఘాతం

సెర్చ్‌ ఆపరేషన్‌కు విఘాతం

ప్రస్తుతం కేరళలో భారీగా వర్షాలు కురవడంతో సెర్చ్‌ ఆపరేషన్‌కు విఘాతం ఏర్పడింది. బహుశా మీనాచిల్‌ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, క్రొయేషియా చేతిలో అర్జెంటీనా జట్టు ఓటమి పాలవ్వడాన్ని అర్జెంటీనా మీడియా ఘోర అవమానంగా అభివర్ణించింది. ‘‘క్రొయేషియా చేతిలో ఓటమి తీరని విషాదం. అర్జెంటీనా నిరాశపరిచింది. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమంచే స్థితిలో నిలిచింది'' అని ఓ పత్రిక తన వెబ్‌సైట్లో కథనంగా రాసుకొచ్చింది.

Story first published: Saturday, June 23, 2018, 12:47 [IST]
Other articles published on Jun 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X