న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

కొత్త అనుభూతి: ఫిఫా వరల్డ్ కప్ హుక్కా కోసం క్యూ (వీడియో)

By Nageshwara Rao
A ‘World Cup’ hookah? Video of shisha inspired by FIFA trophy goes viral in Egypt

హైదరాబాద్: ఐపీఎల్ భారత్‌లో కాసుల వర్షం కురిపించే టోర్నీ. ఐపీఎల్ ప్రారంభమవుతుంటే చాలు అభిమానులను ఆకట్టుకునేందుకు పలు హోటల్స్‌, రెస్టారెంట్స్‌ యాజమాన్యం వినూత్నంగా ఆలోచిస్తుంటాయి. అభిమానులను ఆకర్షించుకునేందుకు గాను వంటకాలకు ఆటగాళ్ల పేర్లు పెట్టడం, పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయడం లాంటివి చేస్తుంటాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ప్రస్తుతం రష్యా వేదికగా 21వ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి సంప్రదాయం ఈజిప్టులో మొదలైంది. ఇందులో భాగంగా ఈజిప్టులో ఓ కాఫీ షాపు యజమాని ఫుట్‌బాల్‌ ప్రియులను ఆకర్షించేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

అదేంటంటే, ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు ఇచ్చే ట్రోఫీ మాదిరి ఓ నమూనాను ప్రత్యేకంగా తయారు చేయించి దానిని హుక్కాగా మార్చాడు. ఈ విషయం తెలుసుకున్న పుట్ బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కొత్త తరహా హుక్కా పీల్చేందుకు క్యూ కడుతున్నారంట.

ఈ విషయాన్ని ఆ కాపీ షాపులో హుక్కా పీల్చిన వారు తమ తమ కొత్త అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అంతేకాదు వరల్డ్ కప్‌తో హుక్కా తాగే ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తన ప్రయత్నం విజయవంతం కావడంతో షాపు యజమాని సైతం సంతోషం వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, June 21, 2018, 16:06 [IST]
Other articles published on Jun 21, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X