Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌కి ఉద్వాసన: వరల్డ్‌కప్‌కు ముందు స్పెయిన్‌కు ఎదురుదెబ్బ

A day before World Cup Spain sack coach Lopetegui

హైదరాబాద్: రష్యా వేదికగా మరికొన్ని గంటల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అలాంటి సమయంలో స్పెయిన్ క్యాంపులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు ప్రధాన కోచ్ జులెన్ లాపెటెగోయ్‌కు స్పానిష్ పుట్‌బాల్ ఫెడరేషన్(ఆర్ఎఫ్ఈఎఫ్) ఉద్వాసన పలికింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | ఫిఫా వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్: తేదీలు, వేదికలు, సమయం

అతడి స్థానంలో వరల్డ్ కప్ వరకు కొత్త కోచ్‌గా ఫెర్నాండో హిఎర్రో బాధ్యతలు స్వీకరించనున్నాడు. 51 ఏళ్ల జులెన్ లాపెటెగోయ్‌ మూడేళ్ల పాటు రియల్ మాడ్రిడ్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జులెన్ లాపెటెగోయ్‌ చేసుకున్న ఒప్పందం ఎంత మాత్రం నచ్చని స్పానిష్ పుట్‌బాల్ ఫెడరేషన్ అతడిని ప్రధాన కోచ్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

బుధవారం ఉదయం నుంచీ కోచ్ జులెన్ లాపెటెగోయ్‌ ఉద్వాసన పలుకుతారనే వార్తలు వచ్చినప్పటికీ, మధ్యాహ్నానికి ఈ వార్తలకు బలం చేకూరిస్తూ ఆర్ఎఫ్ఈఎఫ్ అధికారిక ప్రకటన చేసింది. నిజానికి స్పెయిన్ జట్టుతో లాపెటెగోయ్‌ 2020 యూరోపియిన్ ఛాంపియన్‌షిప్స్ వరకు ఒప్పందం చేసుకున్నాడు.

యూరో 2016 టోర్నీ సందర్భంగా స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ లాపెటెగోయ్‌‌ని కోచ్‌గా ఎంపిక చేసింది. లాపెటెగోయ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ జట్టులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు. అతడి కోచింగ్‌లో స్పెయిన్ జాతీయ పుట్‌బాల్ జట్టు అద్భుతాల చేసింది.

దీంతో ఈ ఏడాది మే నెలలో అతడి ఒప్పందాన్ని మరో రెండేళ్ల పాటు అంటే 2020 వరకు పొడిగించారు. స్పెయిన్‌కు చెందిన అండర్-17, అండర్-19, అండర్-20, అండర్-21 జట్లకు కోచింగ్ ఇచ్చాడు. కాగా, వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా స్పెయిన్ వరల్డ్ కప్ ఛాంపియన్ పోర్చుగల్ జట్టుతో తలపడనుంది.

రష్యాలో జరుగనున్న ఫిఫా ప్రపంచకప్‌లో బరిలో దిగుతున్న ఫెవరెట్ జట్లలో స్పెయిన్ ఒకటి. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇలాంటి నిర్ణయం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని ఆదేశ ఫుట్‌బాల్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

Story first published: Wednesday, June 13, 2018, 18:17 [IST]
Other articles published on Jun 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+