96 ఏళ్ల రికార్డ్ బద్దలుకొట్టిన 17 ఏళ్ల చిన్నోడు!
మెక్సికో యువ ఫుట్‌బాలర్, 17 ఏళ్ల గిల్బెర్టో మోరా చరిత్ర సృష్టించాడు. మెక్సికో టీమ్ తరఫున ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ క్రమంలో అతను 96 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా సౌతాఫ్రికాతో గురువారం జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం ద్వారా గిల్బెర్టో మోరా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 65వ నిమిషంలో అల్వారో ఫిడాల్గో స్థానంలో గిల్బెర్టో మోరా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. 17 ఏళ్ల 240 రోజుల వయసులోనే ఫిఫా ప్రపంచకప్ బరిలోకి దిగాడు. ఈ క్రమంలో అతను 1930 నాటి తొలి ప్రపంచకప్‌లో మాన్యుయెల్ చాక్వెటాస్ రోసాస్ (18 ఏళ్ల 134 రోజులు) నెలకొల్పిన 96 ఏళ్ల నాటి రికార్డును తిరగరాశాడు. గత 96 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉండగా.. తాజాగా మోరా అధిగమించాడు.

ఆరో ప్లేయర్‌గా..
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్బెర్టో మోరా 6వ స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందు కేవలం ఐదుగురు మాత్రమే అత్యంత చిన్న వయసులో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడారు.
నార్మన్ వైట్‌సైడ్ (ఉత్తర ఐర్లాండ్) - 17 ఏళ్ల 41 రోజులు
శామ్సన్ ఎటో (కామెరూన్) - 17 ఏళ్ల 99 రోజులు
ఫెమి ఒపాబున్మి (నైజీరియా) - 17 ఏళ్ల 101 రోజులు
సలోమన్ ఒలెంబే (కామెరూన్) - 17 ఏళ్ల 185 రోజులు
పెలే (బ్రెజిల్) - 17 ఏళ్ల 235 రోజులు
గిల్బెర్టో మోరా (మెక్సికో) - 17 ఏళ్ల 240 రోజులు
48 జట్లలోనే చిన్నోడు..
మెక్సికో, అమెరికా, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో మొత్తం 48 జట్లు పోటీపడుతుండగా.. మొత్తం 1,248 ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ఈ 1248 ఆటగాళ్లలో గిల్బెర్టో మోరానే అత్యంత చిన్నవాడు కావడం విశేషం.
గిల్బెర్టో మోరా కేవలం వయసులోనే చిన్నవాడు, కానీ మైదానంలో అతని ఆటతీరు, ఒత్తిడిని ఎదుర్కొనే విధానం 25 ఏళ్ల సీనియర్ ప్లేయర్‌ను తలపిస్తుంది. క్లబ్ తిజువానా తరఫున ఇప్పటికే 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతని సొంతం. ఈ టోర్నీలో అతను గనుక ఒక గోల్ సాధిస్తే.. లెజెండ్ పెలే తర్వాత ప్రపంచకప్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో గోల్ కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ఎవరీ గిల్బర్ట్ మోరా..?
మెక్సికోలోని చియాపాస్‌లో జన్మించిన మోరా.. క్లబ్ టిజువానా అడాడమీ ద్వారా పుట్‌బాల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ క్లబ్ తరఫున 50 మ్యాచ్‌లు ఆడిన మోరా.. 2025లో మెక్సికో సీనియర్ టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. తద్వారా మెక్సికో టీమ్ తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు. మెక్సికో గోల్డ్ కప్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

