Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్: చరిత్ర సృష్టించిన భారత బాలిక నథానియా

11-year-old Nathania John makes history in becoming first Indian ball girl FIFA World Cup 2018

హైదరాబాద్: రష్యాలో వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో భారత బాలిక నథానియా జాన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అధికారిక మ్యాచ్‌ బాల్‌ క్యారియర్‌ (ఓఎంబీసీ)గా వ్యవహరించిన తొలి భారత బాలికగా నథానియా చరిత్ర సృష్టించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఫిఫా కప్‌లో భాగంగా శుక్రవారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో బ్రెజిల్‌-కోస్టారికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు నథానియా 'బాల్‌గర్ల్‌'గా వ్యవహరించింది. మాజీ ఛాంపియన్, రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో టైటిల్ రేసులో ఒకటిగా ఉన్న బ్రెజిల్‌ను సగర్వంగా మైదానంలోకి తోడ్కొని వచ్చింది.

 నథానియాకు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో ఇష్టం

నథానియాకు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో ఇష్టం

తమిళనాడులోని నీలగిరికి చెందిన నథానియాకు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో ఇష్టం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోగల రిషి వ్యాలీ స్కూల్‌లో ఆమె ఆరో తరగతి చదువుతోంది. ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేస్తే మన దేశం నుంచి వీళ్లిద్దరూ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

అరుదైన గౌరవం దక్కించుకున్న నథానియా

అరుదైన గౌరవం దక్కించుకున్న నథానియా

భారత్లో ఫిఫా స్పాన్సర్‌ కియా మోటార్స్‌ నిర్వహించిన దేశవ్యాప్త పోటీలో నెగ్గిన నథానియా ఈ గౌరవం దక్కించుకుంది. ఆమెతోపాటు కర్ణాటకకు చెందిన 10 ఏళ్ల రిషీ తేజ్‌ కూడా బాల్‌బాయ్‌గా ఎంపికయ్యాడు. భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ట్రయల్స్‌ నిర్వహించి వీరిని ఎంపిక చేశాడు. తనకు దక్కిన గౌరవంపై నథానియా సంతోషం వ్యక్తం చేసింది.

ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటా

ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటా

ఈ సందర్భంగా నథానియా మాట్లాడుతూ "నా అభిమాన ఆటగాడైన నెయ్‌మార్‌ను కలిసే అవకాశం దక్కింది. నెయ్‌మార్‌ బార్సిలోనా ఆటగాడు కౌంటిన్హో తదితర ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటా. మ్యాచ్‌ కోసం మెస్సీ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్లాడు. మెస్సీని కలిసే అవకాశం దక్కకపోవచ్చు. అదృష్టం బాగుండి నేను ఒకవేళ అతడ్ని కలిస్తే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గౌరవానికి ఎంపికవుతానని ముందు నుంచీ తాను విశ్వాసంతో ఉన్నా. ప్రపంచక్‌పలో తనను చూశాకైనా భారత్‌లో ఎంతోమంది బాలికలు ఫుట్‌బాల్‌లోకి వస్తారు" అని నథానియా విశ్వాసం వ్యక్తం జేసింది.

బెల్జియం-పనామా మ్యాచ్‌లో బాల్ బాయ్‌గా రిషి తేజ్‌

బెల్జియం-పనామా మ్యాచ్‌లో బాల్ బాయ్‌గా రిషి తేజ్‌

ఇదిలా ఉంటే టోర్నీలో భాగంగా గత సోమవారం బెల్జియం-పనామా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కర్ణాటకకు చెందిన పదేళ్ల రిషి తేజ్‌ అధికారిక బంతిని మైదానంలో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, June 23, 2018, 13:42 [IST]
Other articles published on Jun 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+