For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2007 సీన్ రిపీట్: ఆస్ట్రేలియాను పడగొట్టిన జింబాబ్వే.. ఇక కప్పు మనదేనా?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది. పసికూన జింబాబ్వే మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా‌ను చిత్తు చేసింది. గ్రూప్-బీలో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బ్లెస్సింగ్ ముజర్బాని(4/17) ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియాకు ఇది రెండో పరాజయం. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007లోనూ జింబాబ్వే చేతిలోనే ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్ జట్టు విజేతగా నిలిచింది. తాజా టోర్నీలోనూ ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాకివ్వడంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? భారత్ విజేతగా నిలుస్తుందా? అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్(56 బంతుల్లో 7 ఫోర్లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. తడివాన్ష్ మరుమణి(35), ర్యాన్ బర్ల్(35) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినీస్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.

A Miracle in Colombo Zimbabwe Replays 2007 Upset Will India Win T20 World Cup 2026

అనంతరం ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాట్ రేన్‌షా(44 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇతర బ్యాటర్ల నుంచి అతనికి సహకారం లభించలేదు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బాని(4/17) నాలుగు వికెట్లు తీయగా.. బ్రాడ్ ఇవాన్స్(3/23) మూడు వికెట్లు పడగొట్టగా.. వెల్లంగ్టన్, ర్యాన్ బర్ల్ తలో వికెట్ తీసారు.

170 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. ఓపెనర్లు జోష్ ఇంగ్లీస్(8), ట్రావిస్ హెడ్(17), కామెరూన్ గ్రీన్(0), టీమ్ డేవిడ్(0) తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో ఆసీస్ పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మ్యాక్స్‌వెల్(31), మ్యాట్ రేన్‌షా జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ జోడీని బర్ల్ విడదీసాడు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినీస్(6), బెన్ ద్వార్షాయిస్(6), ఆడమ్ జంపా(2), మాథ్యూ కుహ్నేమన్(0) విఫలమవడంతో ఆసీస్‌కు ఘోర ఓటమి తప్పలేదు.

Story first published: Friday, February 13, 2026, 15:12 [IST]
Other articles published on Feb 13, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+