Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ZIM vs WI: రెండు దేశాల తరఫున సెంచరీ.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత!

 ZIM vs WI: Gary Ballance becomes 2nd batter in Test history with hundreds for two countries

న్యూఢిల్లీ: జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య జరగుతున్న తొలి టెస్ట్ సంచలనాలకు అత్యంత అరుదైన ఘనతలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇదే మ్యాచ్‌లో విధ్వంసకర డబుల్ సెంచరీ‌తో వెస్టిండీస్ యువ ప్లేయర్ తేజ్‌నరేన్ చంద్రపాల్ (467 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్‌లతో 207 నాటౌట్) అరుదైన ఫీట్ సాధించగా.. మంగళవారం జింబాబ్వే క్రికెటర్‌ గ్యారీ బ్యాలెన్స్‌(137 నాటౌట్) సెంచరీతో రేర్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివ్ నరేన్ చంద్రపాల్ తనయుడు తేజ్‌నరేన్ చంద్రపాల్.. తన తండ్రితో కలిసి క్రికెట్ చరిత్రలోనే డబుల్ సెంచరీలు బాదిన తండ్రీ కొడుకులుగా చరిత్ర సృష్టించారు.

రెండు దేశాల తరఫున సెంచరీ..

రెండు దేశాల తరఫున సెంచరీ..

ఇక జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ సెంచరీతో రెండు దేశాల తరఫున శతకం అందుకున్న రేర్ ఫీట్ సాధించాడు. గ్యారీ బ్యాలెన్స్‌కు టెస్టుల్లో ఇది ఐదో సెంచరీ. అయితే ముందు వచ్చిన నాలుగు టెస్టు సెంచరీలు ఇంగ్లండ్‌ తరపున చేశాడు. 2013 నుంచి 2017 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్యారీ బ్యాలెన్స్‌ ఆ దేశం తరఫున నాలుగు టెస్టు శతకాలు సాధించాడు. తాజాగా జింబాబ్వే తరఫున సెంచరీ సాధించడంతో రెండు దేశాల తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గ్యారీ బ్యాలెన్స్‌ గుర్తింపు పొందాడు. ఇంతకముందు కెప్లర్‌ వెసెల్స్‌ ఈ ఫీట్‌ సాధించాడు. 1982-85 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ఆడిన అతను ఆ తర్వాత 1991-94 మధ్య తన సొంత దేశమైన సౌతాఫ్రికాకు ఆడాడు.

పూర్వీకుల దేశం కావడంతో..

పూర్వీకుల దేశం కావడంతో..

జింబాబ్వేలోనే గ్యారీ బ్యాలెన్స్‌ పుట్టి పెరగడంతో పాటు విద్యను అభ్యసించాడు. 2006లో తమ పూర్వీకుల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.

ఇంగ్లండ్‌ తరఫున క్రికెట్‌ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్‌.. ఆ క్రమంలో కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్‌.. ఆతర్వాత ఫామ్‌ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.

జట్టులో చోటు కోల్పోవడంతో..

జట్టులో చోటు కోల్పోవడంతో..

ఆ తర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్‌ ఇంగ్లండ్‌ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్‌ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. జింబాబ్వేతో తాజా టెస్ట్‌లో బ్యాలెన్స్.. ఆ జట్టును ఆదుకున్నాడు.

వెస్టిండీస్ 379/9 డిక్లేర్..

వెస్టిండీస్ 379/9 డిక్లేర్..

192 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగుతున్న జట్టును బ్యాలెన్స్ ఆదుకున్నాడు. క్రీజులోకి వచ్చిన బ్రాండన్‌ మవుటా(56)తో కలిసి 8వ వికెట్‌కు 135 పరుగులు జోడించాడు. దాంతో జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌ను 379/9 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. దాంతో వెస్టిండీస్‌కు 68 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 447 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. తేజ్‌నరేన్ చంద్రపాల్ (467 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్‌లతో 207 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో రాణించాడు.

Story first published: Tuesday, February 7, 2023, 20:10 [IST]
Other articles published on Feb 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+