న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Zimbabwe Vs Bangladesh: ఇది నేనెప్పుడూ చూడలే.. దెయ్యం ఖాతాలో తొలి వికెట్ (వీడియో)

ZIM vs BAN: Ghost Picks The Wicket In a T20 Cricket Match, Here Is the Video
OMG! ‘First Ever Wicket Taken By A Ghost’ During Zimbabwe Vs Bangladesh Match | Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్‌ ఆటలో అప్పుడ‌ప్పుడు వింత సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. ఒక్కోసారి బ్యాట్స్‌మన్‌ ఎవరూ ఊహించని విధంగా విచిత్ర‌మైన రీతిలో పెవిలియన్ చేరుతుంటారు. ఫీల్డర్ అద్భుతమైన రనౌట్, క్యాచులు పట్టడంతో బ్యాట్స్‌మన్‌ ఔట్ అవుతుంటారు. అయితే వికెట్ల మీద ఉండే బెయిల్స్ వాటంత‌ట అవే ప‌డిపోయిన సంఘ‌ట‌న‌లు చాలా చాలా అరుదు. బలమైన గాలులు వీస్తే తప్ప బెయిల్స్ కిందపడవు. కానీ ఓ మ్యాచ్‌లో ఎలాంటి గాలి లేకున్నా.. బెయిల్స్ కిందపడిపోయాయి. దీంతో దెయ్యం వికెట్ తీసింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

పడిపోయిన బెయిల్స్

విషయంలోకి వెళితే.. బంగ్లాదేశ్ జ‌ట్టు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇటీవ‌ల హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ ఆడింది. అయితే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లోని 18వ ఓవ‌ర్‌లో ఆ జ‌ట్టుకు చెందిన మ‌హ‌మ్మ‌ద్ సైఫుద్దీన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. జింబాబ్వే బౌలర్ టెండాయ్ చతారా ఐదవ బంతి వేయకముందే.. వికెట్ల మీద ఉన్న బెయిల్స్ వాటంత‌ట అవే ప‌డిపోయాయి. ఇది గమనించని బ్యాట్స్‌మన్ వెనక్కి జరిగి పుల్ షాట్ ఆడాడు. ఆపై వెనక్కి తిరిగి చూసుకోగా.. బెయిల్స్ పోడిపోయి ఉన్నాయి. దీంతో సైఫుద్దీన్ షాక్ అయ్యాడు. తాను గాని బాల్ గాని తగల్లేదు కదా.. బెయిల్స్ ఎలా పడిపోయాయని కాసేపు ఆశ్చర్యపోయాడు.

స్టంప్ ఎలా క‌దిలిందో

స్టంప్ ఎలా క‌దిలిందో

ఫీల్డ్ అంపైర్లు స్ప‌ష్ట‌త కోసం థ‌ర్డ్ అంపైర్‌ను అడిగారు. రీప్లేల్లో బ్యాట్స్‌మ‌న్ స్టంప్స్‌కు త‌గ‌ల్లేద‌ని స్పష్టంగా తేలింది. హిట్ వికెట్ కాలేదని తేలింది. దీంతో బెయిల్స్ ఎందుకు ప‌డిపోయాయో అర్థం కాలేదు. గాలి కార‌ణంగా బెయిల్ కింద ప‌డింద‌ని అనుకున్నా.. స్టంప్ ఎలా క‌దిలిందో మాత్రం అర్థం కాలేదు. ఈ మిస్ట‌రీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు మాత్రం ఆ వీడియోను చూసి ర‌క ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. దెయ్యం వికెట్ తీసింద‌ని, క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా దెయ్యం తీసిన వికెట్ ఇదేన‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు మీరూ చూసేయండి.

Mirabai Chanu:'బంపర్ ఆఫర్' అంటే ఇదే.. మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్ వ‌చ్చే చాన్స్‌! అదెలాగంటే?

సొంత గడ్డపై వరుస పరాజయాలు

సొంత గడ్డపై వరుస పరాజయాలు

రెండో టీ20 మ్యాచులో జింబాబ్వే 23 పరుగుల తేడాతో గెలిచింది. మొదటగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మాధ్వెరే (73), డియోన్ మైయర్స్ (26), ర్యాన్ బర్ల్ (34) రాణించారు. బంగ్లా బౌలర్ షరీఫుల్ ఇస్లాం మూడు వికెట్లు పడగొట్టాడు. మోస్తరు లక్ష్య ఛేదనలో బంగ్లా 19.5 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ అయింది.

షమీమ్ హుస్సేన్ చేసిన 29 పరుగులే టాప్. సౌమ్యా సర్కార్, షకీబ్ ఉల్ హాసన్, మొహ్మదుల్లాలు నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లు ల్యూక్ జోంగ్వే, వెల్లింగ్టన్ మసకాడ్జా తలో మూడు వికెట్లు పడగొట్టాడు. సొంత గడ్డపై జింబాబ్వే మూడు సిరీసులను కోల్పోయింది. అన్ని ఫార్మాట్లలో కలిపి రెండో టీ20 మ్యాచ్ మాత్రమే గెలిచింది.

Story first published: Monday, July 26, 2021, 19:00 [IST]
Other articles published on Jul 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X