అతని వల్లే ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ.. సిరీస్ విజయంలో ఆ సైలెంట్ హీరో కీలకం: జహీర్ ఖాన్

ముంబై: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కారణంగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా అవతారమెత్తాడని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో అదరగొట్టడంతోనే కోహ్లీకి ఓపెనింగ్ చేయాలనే ఆలోచన తట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లండ్‌తో గత శనివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 5 టీ20ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. మరోవైపు రోహిత్ కూడా మెరవడంతో ఈ ఇద్దరి ఓపెనింగ్ కాంబినేషన్ ఆశలు రెకెత్తిస్తోంది. ప్రస్తుతం వీరి ఓపెనింగ్ కాంబినేషన్‌పై తీవ్ర చర్చ జరుగుతుంది.

సూర్య వల్లే..
ఈ నేపథ్యంలోనే క్రిక్‌బజ్‌తో రోహిత్-విరాట్ ఓపెనింగ్ కాంబినేషన్‌పై స్పందించిన జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఎవరైనా.. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా ఎలా వస్తాడు? అదెలా సాధ్యమని ప్రశ్నించుకుంటే.. వారికి దొరికే సమాధానమే.. సూర్యకుమార్ యాదవ్. అతని లాంటి యువబ్యాట్స్‌మన్ టీమిండియాకు దొరకడం, మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి తానేంటో నిరూపించుకోవడంతో కోహ్లీకి ఓపెనింగ్ చేయాలనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఈ వ్యూహాత్మక మార్పు మంచి ఫలితాన్ని ఇవ్వడంతో కోహ్లీ కూడా రోహిత్‌తో కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. అలాగే నాలుగో స్థానంలో ఆడే శ్రేయస్ అయ్యర్ మరింత కిందకు వెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనింగ్ చేయడం మంచిదని, ఓ సారి ప్రయత్నిద్దామని కోహ్లీ భావించి ఉండొచ్చు. 'అని జహీర్ చెప్పుకొచ్చాడు.

అతనే సైలెంట్ హీరో..
ఇంగ్లండ్‌పై ఐదు టీ20ల సిరీస్‌ను భారత జట్టు గెలవడంలో ఓ సెలైంట్ హీరో పాత్ర కీలకమైనదని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. సిరీస్ విజయంలో అందరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల పాత్ర గురించి మాట్లాడుతున్నారు. కానీ.. ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్.. అగ్రశ్రేణి ఆటగాళ్లకి మించిన ప్రదర్శనని ఈ సిరీస్‌లో కనబర్చాడని జహీర్ ఖాన్ కొనియాడాడు. 'శార్ధూల్ ఠాకూర్ సెలైంట్ హీరో.. మీరు ఈ సిరీస్‌లో గుర్తించారా..? భారత క్రికెట్‌లో ఇప్పుడు చాలా పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి. వారికి క్రేజ్ కూడా వస్తోంది. కానీ.. వీటన్నింటి మధ్య శార్ధూల్ ఠాకూర్.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయాడు. ఈ సిరీస్‌లో అతను సైలెంట్ హీరో. అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోలిస్తే..? అతని గణాంకాలు ఈ సిరీస్‌లో మెరుగ్గా ఉన్నాయి'అని జహీర్ ఖాన్ వెల్లడించాడు.

సూపర్ బౌలింగ్‌తో..
ఇంగ్లండ్‌తో చివరి రెండు టీ20ల్లోనూ స్లాగ్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన శార్ధూల్ ఠాకూర్.. మిడిల్ ఓవర్లలో కీలకమైన వికెట్లు.. అదీ బ్యాక్ టు బ్యాక్ పడగొడుతూ వచ్చాడు. దాంతో.. చేజింగ్‌లో ఇంగ్లండ్ ఒత్తిడికి గురవుతూ వచ్చింది. ఇదే విషయాన్ని జహీర్ ఖాన్ ప్రస్తావించాడు. బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ శార్ధూల్ ఠాకూర్ ఛాన్స్ దొరికినప్పుడు బ్యాట్ ఝళిపించాడు. అయితే.. ఫీల్డింగ్‌లో మాత్రం చిన్న చిన్న తప్పిదాలతో అదనంగా పరుగులిస్తూ.. విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుండగా.. ఈ సిరీస్‌కి కూడా శార్ధూల్ ఠాకూర్‌కి భారత సెలెక్టర్లు అవకాశమిచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications