
హార్దిక్ బౌలింగ్ చేయకుంటనే..
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా ఎంపిక చేసిన జహీర్.. ఆ తర్వాత కోహ్లీ, సూర్య బ్యాటింగ్ చేస్తారన్నాడు. 'కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనింగ్ చేస్తారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తారు. ఇక ఓపెనర్‌గా బరిలోకి దిగుతానని కోహ్లీ చెప్పిన విషయం నాకు తెలుసు. అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయని సందర్భంలోనే కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడనుకుంటున్నా. ఎందుకుంటే ఓ ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకునేందుకు కోహ్లీ ఓ బ్యాట్స్‌మెన్‌ను పక్కనపెట్టి ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. 'అని జహీర్ తెలిపాడు.

యుజ్వేంద్ర చాహల్..
ఇక స్పిన్నర్లలో రాహుల్ చాహర్, యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేసిన జహీర్.. కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టాడు. అంతేకాకుండా స్టార్ పేసర్ అయిన భువనేశ్వర్ చోటుపై క్లారిటీ ఇవ్వలేదు. వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్‌లో ఒకరికే అవకాశం దక్కనుందన్నాడు. 'లీడ్ లెగ్ స్పిన్నర్‌గా నేను చాహల్‌ను ఎంచుకున్నాను.
అతనికి బ్యాకప్‌గా రాహుల్ చాహర్‌ను తీసుకున్నాను. లెగ్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించడం మనం చూస్తూనే ఉన్నాం. చక్రవర్తి లేదా సుందర్‌లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఈ ఇద్దరు కొత్తబంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలరు. మిస్టరీ స్పిన్‌ను పరిగణలోకి తీసుకుంటే చక్రవర్తీ, లేకుంటే సుందర్‌ను తీసుకోవచ్చు.'అని జహీర్ చెప్పుకొచ్చాడు. పేసర్లుగా దీపక్ చాహర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేసిన జహీర్ నటరాజన్/భువనేశ్వర్ కుమార్‌లో ఒకరికి అవకాశం దక్కుతుందన్నాడు.

జహీర్ ఖాన్ వరల్డ్ కప్ టీమ్..
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, టీ నటరాజన్/ భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్/వరుణ్ చక్రవర్తీ


Click it and Unblock the Notifications












