Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లెక్కల్లో మేం కొంచెం వీక్ సార్.. ఇషాంత్, జహీర్ సెటైర్లు!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ‌ల టెస్ట్ రికార్డ్స్ అందర్నీ అవాక్కయ్యేలా చేశాయి. కాకతాళీయమో.. లేక విచిత్రమో తెలియదు కానీ.. ఈ ఇద్దరీ టెస్ట్ గణంకాలన్నీ సమంగా ఉండటం.. ఆ విషయం ఆలస్యంగా తెలియడం అందర్నీ బిత్తరపోయేలా చేసింది.

భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌కు జియో సినిమా హిందీ కామెంటేటర్లుగా వ్యవహరించిన ఈ లెజండరీ బౌలర్లు.. తమదైన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు. కామెంట్రీ సందర్భంగానే ఇద్దరి టెస్ట్ రికార్డ్స్ చూసుకొని అశ్చర్యపోయారు. వారు షాక్ అవ్వడమే కాకుండా అభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురి చేశారు.

Zaheer Khan Ishant Sharma

నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించగా.. జియో సినిమాలో కామెంట్రీ చెబుతున్న ఈ ఇద్దరూ తమ టెస్ట్ గణంకాలను చూసుకున్నారు. చాలా వరకు గణంకాలన్నీ సమంగా ఉండటంతో షాక్ అయ్యారు. వారితో పాటు సహచర కామెంటేటర్లు వసీం జాఫర్ ఆకాశ్ చోప్రా కూడా 'ఇప్పటి వరకూ ఈ విషయాన్ని గమనించలేదే' అని కామెంట్ చేశారు.

జహీర్ ఖాన్ తన కెరీర్‌లో 311 టెస్ట్ వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ కూడా సరిగ్గా 311 వికెట్లే తీసాడు. జహీర్ ఖాన్ తన కెరీర్‌లో 11 సార్లు ఐదు వికెట్ల ఘనతను, ఒకసారి 10 వికెట్ల ఘనతను అందుకోగా.. ఇషాంత్ శర్మ కూడా 11 సార్లు 5 వికెట్ల ఘనత.. ఒక్కసారి 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు.

అంతేకాకుండా స్వదేశంలో జహీర్ ఖాన్ 104.. విదేశాల్లో 207 వికెట్లు తీస్తే.. ఇషాంత్ శర్మ కూడా భారత్‌లో 104, ఓవర్‌సీస్‌లో 207 వికెట్లు తీసాడు. ఈ షోలో చూసేంత వరకూ తమకు ఈ విషయం తెలియదని జహీర్, ఇషాంత్ తెలిపారు. 'మేమిద్దరం లెక్కల్లో వీక్‌. అందుకే ఈ షోలో చూసేంత వరకూ మా మధ్య ఇంత పోలిక ఉందని తెలుసుకోలేకపోయాం'అని ఇషాంత్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు.

వర్షం కారణంగా ఐదో రోజు ఆట తుడిచి పెట్టుకుపోగా.. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దాంతో 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. జూలై 27 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, July 25, 2023, 22:14 [IST]
Other articles published on Jul 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+