Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోరియోగ్రాఫర్‌తో సన్నిహితంగా చాహల్ సతీమణి.. నెట్టింట దుమారం!

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ‌కు సంబంధించిన ఓ ఫోటోపై నెట్టింట దుమారం రేగుతోంది. జుగుప్సాకరమైన కామెంట్లతో నెటిజన్లు ధనశ్రీ వర్మను ట్రోల్ చేస్తున్నారు. ధన్మ శ్రీ వర్మ హిందీ పాపులర్ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగింది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ లిస్ట్‌లో నిలిచింది.

ఈ షో సందర్భంగా ఆమెను హగ్ చేసుకున్నప్పుడు తీసిన ఒక ఫోటో‌ను కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫోటో‌లో ధనశ్రీ వర్మ.. ప్రతీక్ ఉతేకర్ సన్నిహితంగా ఉండటంతో వైరల్‌గా మారింది. పెళ్లయిన ఆమెకు మరొకరితో అంత సాన్నిహిత్యం ఎందుకు? అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Yuzvendra Chahal s Wife Dhanashree Verma Gets Trolled after cozy picture with Choreographer

ధన్మశ్రీ వర్మ ఎప్పటికైనా చాహల్‌కు అన్యాయం చేస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధన శ్రీ వర్మకు సీక్రెట్ ఎఫైర్ ఉందనే ప్రచారం ఉంది. ఈ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. చాహల్ లేకుండా శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధనశ్రీ వర్మ పలు కార్యక్రమాలకు హాజరైంది.

ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని వార్తలు రాగా.. దూరంగా ఉంటున్నారు. తీవ్ర మోకాలి గాయానికి గురైన ధనశ్రీ వర్మ ఏడాదిగా బెడ్‌కే పరిమితమైంది. పూర్తిగా కోలుకోని పాపులర్ డ్యాన్స్ షోలో పాల్గొంది. చాహల్ సైతం ఆమెను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ షోకు ప్రత్యేక అతిథిగా హాజరవుతూ నవ్వులు పూయిస్తున్నాడు.

ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్‌తో ధనశ్రీ వర్మ ఎఫైర్ పెట్టుకుందనే ప్రచారం తెరపైకి రావడం చూసి అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాస్త చనువుగా ఉన్నా వివాహేతర సంబంధం అంటగంటేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. భారత జట్టులో చోటు కోల్పోయిన చాహల్... ఇటీవల ప్రకటించిన బీసీసీఐ కాంట్రాక్ట్‌‌ల్లోనూ ఏ కాంట్రాక్ట్ అందుకోలేకపోయాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సమయాత్తం అవుతున్నాడు.

ఈ టోర్నీలో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికవ్వాలనే ఆశతో ఉన్నాడు. కానీ భారత సెలెక్టర్లు బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన స్పిన్నర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పై టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్ వేదికగా జరగనుండటంతో ఒకే స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎంత అద్భుత ప్రదర్శన కనబర్చినా చాహల్ తుది జట్టులోకి రావడం కష్టం.

Story first published: Sunday, March 3, 2024, 15:07 [IST]
Other articles published on Mar 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+