Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధనశ్రీ వర్మ అరాచకం.. వైరలవుతున్న చాహల్ సతీమణి అందాలు!

హైదరాబాద్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ తరం ఆటగాళ్ల సతీమణుల్లో చాహల్ పెళ్లానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ.. లెటెస్ట్ సాంగ్స్‌కు చిందేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంటుకుంటోంది.

అంతేకాకుండా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. తాజాగా భారత్-వెస్టిండీస్‌ మధ్య అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌కు హాజరైన ధనశ్రీ వర్మ.. వైట్ టాప్ లుక్‌లో తళక్కుమన్నది. తన ఎద అందాలను చూపిస్తూ బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించింది.

yuzvendra-chahals-wife-dhanashree-verma-attends-ind-vs-wi-4th-t20-pics-go-viral

గ్యాలరీలో చాహల్‌ను ఉత్తేజపరుస్తూ.. మ్యాచ్‌ను ఆస్వాదించింది. ఇటీవలే యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి ఓ యూట్యూబ్ షోలో పాల్గొన్న ధనశ్రీ వర్మ తన వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలు పంచుకుంది. సోషల్ మీడియా వేదికగా తమ సంసారానికి సంబంధించి వచ్చిన పుకార్లను ఖండించింది. చాహల్‌తో తాను సంతోషంగా ఉన్నానని తెలిపింది.

ఆ మధ్య టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి పలు పార్టీలకు హాజరైన ధనశ్రీ వర్మపై అనేక పుకార్లు వెలువడ్డాయి. చాహల్‌కు తెలియకుండా శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ వర్మ ప్రేమాయణం నడిపిస్తుందని ప్రచారం జరిగింది. చాహల్ లేకుండా శ్రేయస్ అయ్యర్‌తో చనువుగా ఉండటం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

ఆ తర్వాత చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగా తన అందాలతో ధనశ్రీ కుర్రాళ్ల మనసును దోచుకుంటుంది.

వృత్తి రీత్యా డాక్టర్ అయిన ధనశ్రీ.. డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌గా అవతారమెత్తింది. ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ 2014లోనే నవీ ముంబైలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. కొన్నిరోజుల పాటు డెంటిస్ట్‌గా పనిచేశారు.

అయితే కొరియోగ్రఫీ అంటేనే ధనశ్రీకి ఇష్టం. అందుకే డాక్టర్ వృత్తిని వదిలేసింది. ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీని కూడా ప్రారంభించింది. అంతేకాకుండా ఆమెకు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లను ఎప్పటికప్పుడూ అప్‌లోడ్ చేస్తోంది. ఇక ట్విటర్, ఇన్‌స్టాలో ధనశ్రీని చాలా మంది అనుసరిస్తున్నారు. డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన చాహల్‌తో ప్రేమలో పడి అతన్నే పెళ్లి చేసుకుంది.

Story first published: Sunday, August 13, 2023, 18:40 [IST]
Other articles published on Aug 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+