Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Chahal vs Aakash Chopra: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్‌!

Yuzvendra Chahal witty response to Aakash Chopras tweet over Liam Livingstone 108 metres Six

ముంబై: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. టీమిండియా మాజీ ఓపెనర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో ట్విటర్ వేదికగా వాగ్వాదానికి దిగాడు. బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్‌కు బౌలర్ల తరఫున చాహల్ అదరిపోయే కౌంటరిచ్చాడు. ప్రస్తుం ఈ స్వీట్ ట్వీట్ వార్ నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ బ్యాటర్‌ లియామ్ లివింగ్‌స్టోన్ భారీ సిక్స్ బాదిన విషయం తెలిసిందే.

చెన్నై పేసర్ ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా లివింగ్ స్టోన్ కొట్టిన సిక్స్ 108 మీటర్ల దూరంలో పడింది. ఈ సీజన్ ఇప్పటి వరకు ఇదే భారీ సిక్సర్. ఈ సూపర్ సిక్స్‌ను మెచ్చుకుంటూ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. '100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులు ఇవ్వాలి'అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌‌ను చాహల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులిస్తే.. వరుసగా మూడు డాట్ బాల్స్ వేస్తే వికెట్ ఇవ్వాలంటూ కౌంటరిచ్చాడు. చాహల్ కౌంటర్‌కు చోప్రా మరో కామెంట్ కూడా చేయలేకపోయాడు. చాహల్‌- ఆకాశ్‌ చోప్రా మధ్య జరిగిన ఈ సరదా సంభాషణపై మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనా "హాహాహా" అంటూ స్పందించాడు.

Yuzvendra Chahal witty response to Aakash Chopras tweet over Liam Livingstone 108 metres Six

ఈ మ్యాచ్‌లో పంజాబ్ 54 పరుగుల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్(33), జితేశ్ శర్మ(26) రాణించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో, జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. 18 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే(57) మినహా అంతా విఫలమయ్యారు.

Story first published: Monday, April 4, 2022, 17:06 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+