Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Dhanashree Verma: డ్యాన్స్ రియాలిటీ షోలో చాహల్ సతీమణి.. మద్దతుగా శ్రేయస్ అయ్యర్! (వీడియో)

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ.. ప్రముఖ హిందీ డ్యాన్స్ రియాలిటీ షో 'ఝ‌ల‌క్ దిక్లా జా' సీజన్ 11లో ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఈ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ధనశ్రీ.. సూపర్ పెర్ఫామెన్స్‌తో ఫైనల్‌కు చేరువైంది. ఆ షో రూల్స్ ప్రకారం ఫైనల్ చేరాలంటే.. జడ్జీల మార్కులతో పాటు ప్రేక్షకుల మద్దతు కూడా కావాలి.

దాంతో ప్రేక్షకుల మద్దతు కూడగట్టేందుకు యుజ్వేంద్ర చాహల్ రంగంలోకి దిగాడు. తన సహచర ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్‌లు ధనశ్రీ వర్మకు మద్దతు తెలుపుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. మోకాలి గాయం నుంచి కోలుకొని అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరువైన ధనశ్రీ వర్మకు మద్దతుగా ఓటు వేయాలని ఈ స్టార్ ఆటగాళ్లంతా ప్రేక్షకులను అభ్యర్థించారు.

Yuzvendra Chahal, Shreyas Iyer send message to Dhanashree Verma ahead of Jhalak Dikhhla Jaa final

ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ధనశ్రీ వర్మ భారత ఆటగాళ్లందరికి ధన్యవాదాలు తెలిపింది. 'నా బెస్ట్ ఫ్యామిలీ నుంచి మద్దతు లభించడం నా అదృష్టం. ఈ రియాలిటీ షోలో నా పెర్ఫామెన్స్ చూసిన మీకు ధన్యవాదాలు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 'అని క్యాప్షన్‌గా పేర్కొంది.

ధనశ్రీ వర్మకు మద్దతు తెలిపిన టీమిండియా ఆటగాళ్లలో సిరాజ్ మినహా అందరూ టీమిండియాకు దూరంగా ఉన్నారు. చీల మండ గాయంతో సూర్యకుమార్ యాదవ్ దూరమవ్వగా.. పేలవ ఫామ్‌తో చాహల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ భారత తుది జట్టులో చోటు కోల్పోయారు. వీళ్లంతా ఐపీఎల్ 2024 సీజన్‌లోనే బరిలోకి దిగనున్నారు.

ధన శ్రీ వర్మ మోకాలి గాయంతో ఏడాదిన్నర పాటు ఇంటికే పరిమితమైంది. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె.. సూపర్ పెర్ఫామెన్స్‌తో రియాలిటీ షోలో సత్తా చాటుతుంది. ఇక ధన శ్రీ వర్మ, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య వివాహేతర సంబంధం ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. చాహల్ లేకుండా అయ్యర్‌తో కలిసి ధన శ్రీ వర్మ తిరగడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

ఈ రిలేషన్‌షిప్ కోసం ధన శ్రీ వర్మ.. చాహల్‌కు విడాకులు కూడా ఇవ్వనుందని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను చాహల్-ధనశ్రీ వర్మలు ఖండించారు. ఇవన్నీ తప్పుడు వార్తలేనని ప్రచారం చేశారు.

Story first published: Tuesday, February 20, 2024, 10:56 [IST]
Other articles published on Feb 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+