Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధనశ్రీ వర్మకు యుజ్వేంద్ర చాహల్ చెల్లించే భరణమెంతో తెలుసా? నోరెళ్లబెట్టాల్సిందే!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన సతీమణి ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చినట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అటు చాహల్, ఇటు ధనశ్రీ వర్మ అధికారికంగా స్పందించలేదు. అదే సమయంలోనూ ఖండించలేదు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఫొటోలు తొలగించడంతో పాటు పరోక్ష పోస్ట్‌లను షేర్ చేయడంతో ఈ విడాకుల వార్తలకు బలం చేకూరింది.

ప్రేమికుల రోజు..
లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ ఇద్దరూ.. ప్రేమికుల రోజు విడి విడిగా పోస్ట్‌లు పెట్టారు. జిమ్‌‌లో దిగిన ఫొటోలను షేర్ చేసిన ధనశ్రీ వర్మ 'ఈ రోజు కేక్ కట్ చేయాల్సిందే'అని క్యాప్షన్‌గా పేర్కొంది. చాహల్ సైతం క్రిప్టిక్ పోస్ట్‌తో తన ఫొటోలను షేర్ చేశాడు. అయితే తాజాగా ధనశ్రీ వర్మకు యుజ్వేంద్ర చాహల్ భారీ మొత్తంలో భరణం చెల్లించేందుకు సిద్దమయ్యాడని ఓ జాతీయ వెబ్‌సైట్ పేర్కొంది.

Yuzvendra Chahal set to pay Rs 60 crore alimony to Dhanashree Verma Reports

రూ. 60 కోట్ల భరణం..
దాదాపు 60 కోట్ల రూపాయాలను ధనశ్రీ వర్మకు భరణంగా చెల్లించేందుకు చాహల్ సిద్దమైనట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత జీవిత భాగస్వామికి చెల్లించే ఆర్థిక సహాయాన్నే భరణం అంటారు. స్టార్ క్రికెటర్ అయిన చాహల్ సంపాదన కోట్లలో ఉండటంతో రూ. 60 కోట్ల రూపాయలు చెల్లించి వన్‌టైమ్ సెటిల్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు సదరు వెబ్‌సైట్ పేర్కొంది.

ఫ్యాన్స్ ఫైర్..
అయితే ఈ భరణం వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చాహల్, ధనశ్రీ వర్మ ఈ వ్యవహారంపై మాట్లాడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ధనశ్రీ వర్మపై చాహల్ అభిమానులు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. జిమ్ ఫొటోలు షేర్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. రూ. 60 కోట్ల భరణం ఎందుకని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఐపీఎల్‌తో చాహల్ రీఎంట్రీ..
చాహల్‌తో దూరంగా ఉంటున్న ధనశ్రీ వర్మ తన కెరీ‌ర్‌పై ఫోకస్ పెట్టింది. జిమ్‌లో కష్టపడుతూ.. కొరియోగ్రాఫర్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు చాహల్ సైతం ఐపీఎల్ 2025 సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, February 17, 2025, 11:35 [IST]
Other articles published on Feb 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+