
ఫామ్ కోల్పోలేదు..
'నేనో డిఫరెంట్ బౌలర్‌ను. పైగా నేను మణికట్టు స్పిన్నర్‌ను, వాళ్లు ఫింగర్ స్పిన్నర్లు. కాబట్టి వాళ్లతో నాకు పోటీ ఉందని అనుకోవడం లేదు. నా పోటీ నాతోనే. బాగా పెర్ఫామ్ చేస్తే టీమ్‌లో ఉంటాం. లేదంటే బయటికి వెళ్లాలి. నేను చాన్నాళ్ల నుంచి ఆడుతున్నా. ఐపీఎల్‌లో కూడా బౌలింగ్ చేస్తున్నా. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీయలేం. ఓ బౌలర్‌కు కొన్నిసార్లు వికెట్లు పడగొట్టలేని కొన్ని మ్యాచ్‌లు ఎదురవుతుంటాయి. దాన్ని బట్టి తను ఫామ్ కోల్పోయాడు అనడానికి లేదు. అయితే, నేను వికెట్లు తీయడం చూసి ప్రజలు అలవాటు పడ్డారు.
కాబట్టి నేను వికెట్లు తీయలేనప్పుడు సహజంగానే పోలికలు వస్తుంటాయి. అలాగే, ఫ్యాన్స్ నిరుత్సాహపడతారు. అయితే, నేనైతే ఫామ్ కోల్పోలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో బాగా పెర్ఫామ్ చేయలేదు. నా కెరీర్లో ఇది ఒక ఫేజ్ మాత్రమే. ఇలాంటిది బ్యాట్స్‌మెన్‌కు కూడా జరుగుతుంది. నాలుగైదు మ్యాచ్‌ల్లో బాగా స్కోర్ చేయకపోతే వాళ్లపైనా విమర్శలు వస్తాయి. కానీ, తర్వాత అతను పరుగులు చేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగే, మీరు కూడా నన్ను మళ్లీ వికెట్- టేకింగ్ మోడ్‌లో చూస్తారు'అని 30 ఏళ్ల చాహల్ చెప్పుకొచ్చాడు.

ఒకే టైమ్‌లో మూడు జట్టు..
కోహ్లీ కెప్టెన్సీలోని టెస్ట్ టీమ్ ఇంగ్లండ్‌లో ఉండగానే, మరో లిమిటెడ్ ఓవర్ల టీమ్ లంక టూర్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు జట్లను కూడా ఈజీగా బరిలోకి దింపొచ్చని చాహల్ అభిప్రాయపడ్డాడు. 'మన దగ్గర ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మన టీమ్‌లో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్ సిరీస్‌ల కోసం ఒకేసారి మూడు జట్లను సైతం సులువుగా పంపించొచ్చు. నేనైతే శ్రీలంక టూర్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌నకు ఈ టూర్‌ను ప్రిపరేషన్‌గా భావిస్తున్నా. వీలైనన్ని ఎక్కువ వైట్ బాల్ గేమ్స్ ఆడటం టీ20 వరల్డ్‌కప్‌లో నాకు హెల్ప్ అవుతుంది. వరల్డ్‌కప్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి నేను బాగా పెర్ఫామెన్స్ చేస్తానన్న నమ్మకం ఉంది' అని చహల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

టెస్ట్‌ల కోసం వెయిటింగ్
టెస్ట్ చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని చాహల్ తన మనసులోని కోరికను వెల్లడించాడు. 'నిజాయితీగా చెప్పాలంటే టెస్టు టీమ్‌లో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా. ఫార్మాట్ ఏదైనా నా పని బాగా పెర్ఫామ్ చేయడమే. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో నన్ను నేను నిరూపించుకున్నా. ఇప్పుడు మరింత పరిణతి సాధించా. ఒత్తిడి ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బౌలింగ్ చేయగలను. అదే టైమ్‌లో ప్రతి రోజూ ఎంతో కొంత నేర్చుకుంటున్నా. టెస్టుల్లో అశ్విన్, జడేజా బాగా రాణిస్తున్నారు. అక్షర్, కుల్దీప్ కూడా మెప్పించారు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న స్పిన్నర్లు బాగా రాణిస్తున్నారు. నేను కూడా వైట్‌బాల్ క్రికెట్‌లో పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు టెస్టుల్లో వాళ్లను భర్తీ చేయలేనని తెలుసు. ఎందుకంటే వాళ్లు టీమ్‌కు ఉపయోగపడే మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి టెస్టు టీమ్‌లో నా అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అంతే' అని చాహల్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ మద్దతు ఉంది..
విరాట్ నుంచి తనకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఈ లెగ్ స్పిన్నర్ భావిస్తున్నాడు. 'విరాట్ నుంచి నాకెంతో మద్దతు లభించింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చేవాడు. నా దగ్గరకు వచ్చి నీకు నచ్చినట్టుగా బౌలింగ్ చేయి. ఎలాంటి మార్పులు వద్దు అని చెప్పేవాడు. తన మాటలు నన్ను ఎంతగానో మోటివేట్ చేశాయి. ఫీల్డ్‌లోనే కాదు బయట కూడా నాకు ఎంతో సపోర్ట్‌గా నిలుస్తాడు. నేను బాగా పెర్ఫామ్ చేయనప్పుడు దగ్గరికి వచ్చి.. యుజీ, అతిగా ఆలోచించకు. ఎక్కువ ప్రెజర్ తీసుకోకు. నిన్ను నువ్వు నమ్ము అంటూ ఎంకరేజ్ చేశాడు'అని లెగ్ స్పిన్నర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
