
జడేజా మీడియం పేసర్ అయ్యుంటే
తాజాగా స్పోర్ట్స్ తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుజ్వేంద్ర చహల్ పాల్గొన్నాడు. కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఆడిపోవడానికి కారణం ఏమిటని చహల్‌ను ప్రశ్నించగా.. రవీంద్ర జడేజానే అసలు కారణం అన్నాడు. ఒకవేళ జడేజా మీడియం పేసర్ అయ్యుంటే.. యాదవ్‌తో తన భాగస్వామ్యం కొనసాగి ఉండేదన్నాడు. హార్దిక్ పాండ్యా ఉన్నపుడు.. తామిద్దరం జట్టులో ఉన్నామని యూజీ పేర్కొన్నాడు. అయితే తాము కలిసి ఆడటం కన్నా జట్టు కూర్పే ప్రధానమన్నాడు చహల్. యూజీ భారత్ తరఫున 54 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. ఇక కుల్దీప్ 7 టెస్టులు, 63 వన్డేలు, 21 టీ20లు ఆడాడు.

దురదృష్టవశాత్తు జడేజా స్పిన్నర్
'కుల్దీప్ యాదవ్, నేనూ ఆడే రోజుల్లో జట్టులో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. అతను మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. 2018లో గాయం కారణంగా హార్దిక్ తప్పుకొన్నాడు. దీంతో రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్‌గా జట్టులో (పరిమిత ఓవర్ల క్రికెట్లో) పునరాగమనం చేశాడు. 7వ స్థానంలో అతడు బాగా బ్యాటింగ్ చేయగలడు. దురదృష్టవశాత్తు జడేజా స్పిన్నర్. ఇదే మా మమ్మల్ని దెబ్బతీసింది. జడేజా ఒకవేళ మీడియం పేసర్ అయి ఉంటే.. కుల్దీప్, నేను కలిసి ఆడేవాళ్లం' అని యుజ్వేంద్ర చహల్ తెలిపాడు.

నేను ఆడకపోయినా సంతోషంగా ఉన్నా
'కుల్దీప్ యాదవ్, నేను ఏ వన్డే సిరీస్‌లో ఆడినా.. కొన్నిసార్లు అతను సిరీస్‌లోని 5 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు ఆడేవాడు. మరికొన్నిసార్లు నాకు అవకాశం దక్కేది. జట్టు కలయికను బట్టి ఇద్దరం ఆడేవాళ్ళం. 11 మంది ఆటగాళ్లు కలిస్తేనే ఒక జట్టు తయారవుతుంది. హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నా కూడా మాకు అవకాశాలు వచ్చేవి. 7వ స్థానంలో జట్టుకు ఓ మంచి ఆల్‌రౌండర్ అవసరం. నేను ఆడకపోయినా సంతోషంగా ఉన్నా. జట్టు గెలిస్తే చాలు' అని యుజ్వేంద్ర చహల్ పేర్కొన్నాడు.

చివరిసారి ప్రపంచకప్‌లో
తెల్ల బంతి ఫార్మాట్‌లో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ రెగ్యులర్‌గా ఆడేవాళ్లు. ఈ ద్వయంతో భారత్ ఎన్నో విజయాలను అందుకుంది. వారి భాగస్వామ్యాన్ని అభిమానులు 'కుల్-చా' అని కూడా పిలుచుకునే వారు. చివరిసారిగా ఈ జోడి 2019 జూన్ మాసంలో ఇంగ్లండ్ జట్టుపై కలిసి ఆడారు. ఆ మ్యాచులో చహల్ తన 10 ఓవర్లలో 88 పరుగులు ఇవ్వగా.. కుల్దీప్ 72 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆపై కుల్దీప్ జట్టులో చోటు కోల్పోయాడు. గత రెండు సంవత్సరాలుగా పేలవ ప్రదర్శనతో తుది జట్టులోకి రావడం లేదు.


Click it and Unblock the Notifications

కుంబ్లే వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడు.. ఆ పదో వికెట్ నేనే!!










