కుంబ్లే వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడు.. ఆ పదో వికెట్ నేనే!!

హైదరాబాద్: టీమిండియా స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్ మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే వల్ల ఒక బ్యాట్స్‌మన్‌గా నిద్రలేని రాత్రులు గడిపా అని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నారు. ప్రతి బ్యాట్స్‌మన్ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుందని లంక మాజీ సారథి మహేళ జయవర్దనె పేర్కొన్నారు. కుంబ్లే భిన్నమైన లెగ్ స్పిన్నర్ అని పాక్ పేసర్ వసీమ్ అక్రమ్ ప్రశంసించారు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక
టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే దిగ్గజమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రశంసించింది. ఎదుర్కొనే ప్రతి బ్యాట్స్‌మెన్ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక సిద్ధంగా ఉంటుందని తెలిపింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికైన నేపథ్యంలో అతడిపై ఓ వీడియోను ఐసీసీ రూపొందించింది. ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కుమార సంగక్కర, మహేళ జయవర్దనె, వసీమ్ అక్రమ్ తదితరులు జంబోతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.

ప్రపంచ క్రికెట్లో ఓ విజేత
'అనిల్ కుంబ్లే వల్ల ఒక బ్యాట్స్‌మన్‌గా నిద్రలేని రాత్రులు గడిపాను. అతడు అందరిలాంటి సంప్రదాయ లెగ్ స్పిన్నర్ కాదు. పొడవుగా, బలంగా ఉంటాడు. పరుగెత్తుకుంటూ వచ్చి చాలా ఎత్తు నుంచి బంతి వదులుతాడు. వేగంగా, నేరుగా, కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం అంత తేలిక కాదు. బౌలింగ్‌లో వేగం ఉండటంతో బంతి బాగా బౌన్స్ అవుతుంది. అతడు విసరే లెంగ్తుత్లో పిచ్‌పై పగుళ్లు ఉంటే.. ఇక ఆడటం కష్టం. కుంబ్లే చాలా మంచోడు. ఆటను అంకితభావంతో ఆడతాడు. ప్రపంచ క్రికెట్లో ఓ విజేత' అని సంగక్కర అన్నారు.
అసలు నేను జట్టులోనే లేను.. కోహ్లీ లేదా రోహిత్ వికెట్ నేనెలా తీస్తాను! కాస్త మోకాలు రుద్దు సామీ!

పదో వికెట్ నేనే
'అనిల్ కుంబ్లే బలాలేంటో నాకు బాగా తెలుసు. తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రతి బ్యాట్స్‌మన్ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది' అని జయవర్దనె పేర్కొన్నారు. 'ఢిల్లీలో మాపై కుంబ్లే 10 వికెట్లు తీయడం నాకింకా గుర్తుంది. ఆ పదో వికెట్ నేనే. అదేదో నిన్నే జరిగినట్టు నాకు అనిపిస్తుంది. చాలా భిన్నమైన లెగ్ స్పిన్నర్ అతడు' అని వసీమ్ అక్రమ్ చెప్పుకొచ్చారు. కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టారు.

టీమిండియా కోచ్‌గా
అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్‌గా కూడా ఏడాది కాలం పనిచేశారు. అయితే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు అనూహ్యంగా కోచ్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మొదట్లో బాగానే ఉన్నా.. జంబో తరహా క్రమశిక్షణ విరాట్‌కు నచ్చలేదు. ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు రావడంతో.. కుంబ్లేనే హుందాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. భారత దిగ్గజాలు సచిన్ , గంగూలీ, లక్ష్మణ్ వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications