తాగిన మైకంలో ఆ ఆర్‌సీబీ ప్లేయర్ నన్ను బాల్కానీలో వేలాడదీశాడు: యుజ్వేంద్ర చాహల్

ముంబై: రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కానీలో వేలాడదీసాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని చెప్పాడు. గత ఐపీఎల్ సీజన్ వరకూ దాదాపు ఏడేళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహించిన చాహల్‌ను.. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.6.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

వెన్నులో వణుకు..
ఇటీవల తన పాత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన చాహల్ ఆర్‌సీబీని ఓడించేంత పని చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని రనౌట్ చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో జరిగిన భయానక ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆర్‌సీబీ ప్లేయర్ కారణంగా 2013లో ఒకసారి తన వెన్నులో వణుకు పుట్టిందని చెప్పుకొచ్చాడు. 'ఈ స్టోరీని ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఎక్కడా షేర్ చేసుకోలేదు. 2013లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో నేను ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడేవాడ్ని. ఆ ఏడాది బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లకీ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది.

అతిగా మద్యం తాగి..
అందులో ఆర్‌సీబీ ప్లేయర్ ఒకరు అతిగా మద్యం సేవించాడు. నేను అతని పేరు చెప్పను. కానీ.. ఆ రోజు అతను మితిమీరి మద్యం తాగాడు. పార్టీ ముగిసిన తర్వాత అతను నా వైపు చాలాసేపు చూసి.. దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను వెళ్లగానే అతను నన్ను అమాంతం పైకి ఎత్తుకుని.. బాల్కానీ వద్దకి తీసుకెళ్లి వేలాడదీశాడు. దాంతో.. బిత్తరపోయిన నేను నా చేతుల్ని అతని మెడ చుట్టూ వేసి పట్టుకున్నాను. అప్పుడు మేము 15వ ప్లోర్‌లో ఉన్నాం. నేను కొద్ది కొద్దిగా పట్టు కోల్పోతున్నాను. అయితే.. అదే సమయంలో నా కేకలు విని అక్కడే ఉన్న కొందరు వచ్చి నన్ను పట్టుకుని.. రక్షించారు.

ఏ తప్పిదం జరిగినా..
ఊహించని ఘటనతో నేను స్పృహ కోల్పోయాను. అక్కడ ఉన్న వాళ్లు వాటర్ ఇచ్చారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అప్పుడే నాకు అర్థమైంది. కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా. ఏ చిన్న తప్పిదం జరిగి ఉన్నా? నేను 15వ అంతస్తు నుంచి కింద పడిపోయేవాడ్ని'' అని చాహల్ గుర్తు చేసుకున్నాడు. వాస్తవానికి చాహల్‌తో క్రికెటర్లందరూ చాలా సరదాగా ఉంటారు. ఆర్‌సీబీ ఆటగాళ్లే కాకుండా.. మిగిలిన జట్ల ఆటగాళ్లతోనూ చాహల్ చాలా చనువుగా ఉంటాడు. అయితే చాహల్‌ను అలా భయపెట్టింది యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అయ్యుంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications