నిజం చెప్తున్న భయ్యా.. నా పెళ్లప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు: యుజ్వేంద్ర చాహల్

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో విజయం సాధించడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లోని ఉత్కంఠతను తాను తట్టుకోలేకపోయానని తెలిపిన చాహల్.. తన పెళ్లప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదని చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అక్షర్ పటేల్(35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 నాటౌట్) అజేయ శతకంతో చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ విజయానంతరం అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్ సరదాగా చిట్ చాట్ చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకోగా వైరల్ అయ్యింది.
నా పెళ్లప్పుడు కూడా..
'మ్యాచ్ చూస్తున్నంతసేపు నేను గోళ్లు నములుతూ కూర్చున్నాను. ఆ సమయంలో డగౌట్‌లో కూర్చోవడం చాలా ఒత్తిడికి గురి చేసింది. అలాంటి ఒత్తిడి నా పెళ్లప్పుడు కూడా అనుభవించలేదు'అని చాహల్ అన్నాడు. అతను సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలకు పక్కనున్న అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్ నవ్వుకున్నారు. తర్వాత అవేశ్ ఖాన్ మాట్లాడుతూ.. మ్యాచ్ చివరి దశలో ఉండగా విండీస్ బౌలర్లు ఎవరెవరు ఇంకా మిగిలి ఉన్నారు. ఎవరెవరి బౌలింగ్‌లో దంచికొట్టాలనే విషయాలను అక్షర్‌తో చర్చించినట్లు వివరించాడు.

చాహల్‌ను ఇబ్బంది పెట్టలేకనే..
ఆ తర్వాత అక్షర్ పటేల్ బ్యాటింగ్ చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయని, తాను చిన్నప్పుడు అలానే బ్యాటింగ్ చేసేవాడినన చాహల్ చమత్కరించాడు. అయితే దీనికి అక్షర్ పటేల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నేను త్వరగా ఔటైతే చాహల్ భాయ్ వచ్చి జట్టును గెలిపించాల్సి ఉంటుంది. కాబట్టి నేను అతన్ని పెద్దగా ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అందుకే నేనే ఆ పని పూర్తి చేశా'అని అక్షర్ పేర్కొన్నాడు. ఈ చిట్ చాట్ అనంతరం అక్షర్, ఆవేశ్‌లతో చాహల్ తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్‌ను రీక్రియేట్ చేశాడు.

సిక్సర్‌తో విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. కెరీర్‌లో 100వ వన్డే ఆడిన ఓపెనర్ షై హోప్(135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. దీపక్ హుడా, చాహల్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. అక్షర్‌తో పాటు శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 63), సంజూ శాంసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications