Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yuzvendra Chahal Love Story: పొట్టోడు లావటోడు.. టీచర్ అంటూనే లైన్‌లో పెట్టిండు!

Yuzvendra Chahals Complete Love Story With Dhanashree Verma

హైదరాబాద్: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని సతీమణి ధనశ్రీ వర్మ‌ గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరూ తమ రెండేళ్ల వివాహ బంధాన్ని తెంచుకుంటున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. వీరి వివాహ జీవితంపై అనేక రూమర్లు వచ్చాయి. ధనశ్రీ వర్మ.. భర్త చాహల్‌కు హ్యాండిచ్చి యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ప్రేమాయణం నడుపుతుందనే పుకార్లు వెలువడ్డాయి. సోషల్ మీడియా వేదికగా చాహల్, ధనశ్రీ వర్మ పెట్టిన పోస్ట్‌లు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి.

న్యూ లైఫ్ లోడింగ్ అంటూ చాహల్ పోస్ట్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 'చాహల్'అనే తన సర్‌నేమ్‌ను ధనశ్రీ తొలగించింది. దాంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఓ పార్టీకి ధనశ్రీ వర్మ చాహల్‌తో కాకుండా అయ్యర్‌తో హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ ఫ్యాన్స్ చాహల్‌ను సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండకపోతే దినేశ్ కార్తీక్ మాదిరి మోసపోతావని తెలిపారు.

ప్లీజ్.. మా కాపురంలో నిప్పులు పోయకండి..

ప్లీజ్.. మా కాపురంలో నిప్పులు పోయకండి..

ఇక విడాకుల వార్తలను ఈ ఇద్దరూ ఖండించారు. దయచేసి తమ కాపురంలో నిప్పులు పోయవద్దని సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించారు. ఇంతటితో ఈ ప్రచారాన్ని ఆపేయాలని వేడుకున్నారు. ముందుగా యుజ్వేంద్ర చాహల్ ఇన్‌స్టాలో అభిమానులను కోరాగా.. ఆ తర్వాత అదే పోస్ట్‌ను ధనశ్రీ వర్మ షేర్ చేసింది. దాంతో వారి విడాకుల వార్తలు పుకార్లేనని స్పష్టమైంది. అయితే వీరి విడాకుల వార్తల నేపథ్యంలో ఈ ఇద్దరి లవ్ స్టోరీ కూడా చర్చనీయాంశమైంది. వీరి ప్రేమ కథను తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.

ఇద్దర్నీ కలిపిన లాక్‌డౌన్

ఇద్దర్నీ కలిపిన లాక్‌డౌన్

అంతర్జాతీయ క్రికెటర్ అయిన చాహల్‌కు ఓ సాధారణ యూట్యూబర్, డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ ఎక్కడ కలిసిందని, వీరి పరిణయం ఎలా మొదలయ్యిందో అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వీరి లవ్ స్టోరీ అందరిలానే సినిమాను తలపించేలా ఉంది. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్ అందర్ని ఇళ్లకు పరిమితం చేస్తే.. చాహల్, ధనశ్రీలను మాత్రం ఒక్కటి చేసింది. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన చాహల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. తనదైన పోస్ట్‌లతో ఆకట్టుకున్నాడు.

టీచర్.. టీచర్.. అంటూనే..

టీచర్.. టీచర్.. అంటూనే..

అయితే డ్యాన్స్‌లతో మరింత చేరువ కావాలనుకున్న చాహల్.. డ్యాన్స్ నేర్చుకునేందుకు నెట్టింటిని ఆశ్రయించాడు. అప్పుడు ధనశ్రీ వర్మ వీడియోలను చూసి ఫిదా అయ్యాడు. ఆమె దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలని భావించిన చాహల్.. వెంటనే ఆ పనిని ప్రారంభించాడు. అప్పటికే డ్యాన్ అకాడమీ పెట్టి ఆన్‌లైన్ వేదికగా ధనశ్రీ డ్యాన్స్ నేర్పిస్తుంది. దాంతో చాహల్ పని సులువైంది. ఆన్‌లైన్ వేదికగా డ్యాన్ క్లాస్‌లకు హాజరవుతూ.. తన చతురత, సరదా మాటలతో తన డ్యాన్స్ టీచర్‌ను బుట్టలో వేసుకున్నాడు. డ్యాన్స్ క్లాస్‌లు ముగుస్తాయనే సందర్భంలో ధైర్యం చేసిన చాహల్‌.. ధనశ్రీకి ప్రపోజ్ చేశాడు.

పెళ్లికి ముందే..

పెళ్లికి ముందే..

ఆమె వెంటనే ఓకే చెప్పడంతో మనోడు సినిమా హీరోల గంతేసాడు. అప్పటి నుంచి ఇద్దరూ తమ డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. ధోనీ ఫ్యామీలితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన చాహల్ ధనశ్రీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. 2020 డిసెంబర్ 22 ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికాక ముందే చాహల్‌తో ధనశ్రీ ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్‌కి వచ్చింది. గ్యాలరీలో ఫన్ చేస్తూ చాహల్‌ను ఎంకరేజ్ చేసింది. అలా ఒక్కటైన ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది. ఇది నచ్చని కొందరు ఆకతాయిలు వారి బంధంపై పుకార్లు పుట్టించారు.

Story first published: Saturday, August 20, 2022, 17:43 [IST]
Other articles published on Aug 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+