For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా ముచ్చట తర్వాత కానీ.. ముందైతే కోహ్లీ, డివిలయర్స్‌ను ఔట్ చేయండి: చహల్

Yuzvendra Chahals Brutal Response To Mumbai Indians Jasprit Bumrah Tweet

బెంగళూరు: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సోషల్ మీడియా వేదికగా చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇప్పటికే టిక్‌టాక్ వీడియోలతో హాట్ టాపిక్‌గా మారిన ఈ స్టార్ ప్లేయర్.. ఫన్నీ కామెంట్స్‌తో సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. తాజాగా తనను ఉద్దేశించి ముంబై ఇండియన్స్ జట్టు చేసిన ట్వీట్ దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు.

ఇక కరోనా కారణంగా క్రీడా టోర్నీలు రద్దవ్వడం.. ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడటంతో టీమిండియా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ.. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ సీజన్ ఐపీఎల్ గురించి సీరియస్‌గా చర్చించుకుంటున్నారు.

బ్రదర్.. నన్ను మిస్సవుతున్నారా.?

బ్రదర్.. నన్ను మిస్సవుతున్నారా.?

దీంతో వీరి మధ్యలో దూరిన చహల్.. 'బ్రదర్.. నేను లేనని ముంబై ఇండియన్స్ టీమ్ ఏమైనా బాధపడుతుందా?'అని ప్రశ్నించాడు. దీనికి హిట్‌మ్యాన్ కూడా అదే తరహాలో బదులిస్తూ ఈ సంభాషణ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెబుతానని హెచ్చరించాడు. ఇక బుమ్రా అయితే.. 'నువ్వు మళ్లీ ముంబై ఇండియన్స్‌కు రావాలనుకుంటున్నావని మీ కెప్టెన్ కోహ్లీకి చెబుతాం.. 'అని బెదిరించాడు.

ఆ వెంటనే రోహిత్ స్ట్రాంగ్ ఆన్సర్‌తో చహల్ నోరు మూయించాడు. 'మేం గెలవకపోతే నువ్వు లేవని బాధపడాలి. కానీ మేం గెలిచాం. నువ్వు లేవని బాధపడాల్సిన అవసరం మాకు లేదు. చహల్.. నువ్వు ఆర్‌సీబీలోనే ఉండు. అదే నీకు సరైంది'అని సమాధానమిచ్చాడు

చహల్.. నీ కోసమే మా బుమ్రా..

ఇదిలా ఉంచితే, తాజాగా ముంబై ఇండియన్స్‌ చహల్‌ను ఉద్దేశించి ఒక ట్వీట్‌ చేసింది. తమ జెర్సీలో ఉన్న చహల్‌ ఫొటో‌తో పాటు పక్కనే బుమ్రా బంతిని ఎగరేస్తున్న ఫొటోను షేర్ చేసింది. దీనికి ‘చహల్‌ చూశావా.. నిన్ను ఔట్‌ చేయడానికి బుమ్రా బంతిని ఎలా సిద్దం చేస్తున్నాడో.. ఈ ఓవర్‌ ఎలా ఉండబోతుందో ఊహించండి' అని క్యాప్షన్‌గా పేర్కొది. దీనికి చహల్‌ కూడా అంతే స్థాయిలో బదులిచ్చాడు. ‘నేను బ్యాటింగ్ చేసేదే 10,11వ స్థానంలో.. నా ముచ్చట తర్వాత కానీ.. ముందైతే మా బ్యాటింగ్ కింగ్ కోహ్లీ, పించ్ హిట్టర్ ఏబీ డివిలియర్స్‌లను ఔట్ చేయమనండి. అప్పటి వరకు నా వికెట్ గురించి కలలు కనండి'అని చహల్ సమాధానమిచ్చాడు.

చహల్.. ఒకప్పటి ముంబై ప్లేయర్..

చహల్.. ఒకప్పటి ముంబై ప్లేయర్..

ఇక చహల్ 2011,13 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. 2013లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికే ఆ జట్టు నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. ఇక 2014లో ఆర్సీబీకి ఆడిన చహల్ ఆ సీజన్‌లో 12 వికెట్లతో అదరగొట్టాడు. ఆ జట్టు తరఫున 83 మ్యాచ్‌లు ఆడిన చహల్.. 99 వికెట్ల తన ఖాతాల వేసుకున్నాడు. ఇక కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌పై బీసీసీఐ ఎటు తేల్చుకోలేకపోతుంది.

Story first published: Monday, April 6, 2020, 17:45 [IST]
Other articles published on Apr 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+