For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Yuzvendra Chahal: రూ.15-17 కోట్లు పలికేంత సీన్ లేదు కానీ ఓ రూ.8 కోట్లు చాలు భయ్యా!

Yuzvendra Chahal reveals the amount he wants to fetch at IPL 2022 mega auction
IPL 2022 Mega Auction : SRH లోకి Yuzvendra Chahal అన్ని కోట్లు ఐతే లైట్ | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్నాకొద్దీ అటు అభిమానుల్లో ఇటు ఆటగాళ్లలో టెన్షన్ రెట్టింపు అయ్యింది. బెంగళూరు వేదికగా ఈ నెల 12, 13 వ తేదీల్లో మెగా ఆక్షన్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలానికి మొత్తం 590 మంది ప్లేయర్లను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేయగా.. 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకోనున్నాయి.

మెగావేలం నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అమ్ముడుపోయే ధరను అంచనా వేసాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో సరదాగా మాట్లాడిన చాహల్.. వేలంలో తనకు రూ.8 కోట్లు పలికితే ఎక్కువని చెప్పుకొచ్చాడు. యూట్యూబ్ చానెల్ వేదికగా అశ్విన్ నిర్వహిస్తున్న డీఆర్‌ఎస్ విత్ యాష్ అనే కార్యక్రమంలో పాల్గొన్న చాహల్‌ అనేక విషయాలు పంచుకున్నాడు.

రూ. 8 కోట్లు ఎక్కువ?

రూ. 8 కోట్లు ఎక్కువ?

ఈ సందర్భంగా మెగా వేలంలో ఎంత ధరను ఆశిస్తున్నావని చాహల్‌ను అశ్విన్ ప్రశ్నించాడు. అయితే తనకు రూ.15, రూ. 17 కోట్లు పలికే సీన్ లేదని, రూ.8 కోట్లు ఎక్కువని బదులిచ్చాడు. పరోక్షంగా తాను పలికే ధర గురించి చెప్పుకొచ్చాడు. చాహల్ సుదీర్ఘ కాలంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కే ఆడుతున్న విషయం తెలిసిందే. దాదాపుగా గత 8 ఏళ్లుగా చాహల్ ఆర్‌సీబీకే ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో కూడా తనకు ఆర్‌సీబీకే ఆడాలని ఉందని చాహల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇతర జట్లలోకి వెళ్లినా తన వంతు 100 శాతం కృషి చేస్తానని తెలిపాడు.

ఆర్‌సీబీకే ఆడాలని ఉంది..

ఆర్‌సీబీకే ఆడాలని ఉంది..

'ఇన్నేళ్ల ఐపీఎల్ కెరీర్‌లో తొలి సారి ఆర్‌సీబీని వీడుతాననే భావన కలుగుతోంది. ఎందుకంటే ఈసారి రైట్ టు మ్యాచ్(ఆర్‌టీఎమ్) కార్డ్ లేదు. 2018 మెగా వేలం సమయంలో ఆర్‌టీఎమ్ ఉండటంతో మళ్లీ తీసుకుంటామని ఆర్‌సీబీ మెనేజ్‌మెంట్ ముందే చెప్పింది. చెప్పినట్లుగానే ఆర్‌టీఎమ్ కార్డ్ కిందే మళ్లీ నన్ను జట్టులోకి తీసుకుంది. అయితే ఈ సారి ఆ పరిస్థితి లేదు. అయితే ఓ ప్రోఫెషనల్ ఆటగాడిగా ఏ జట్టుకు అయినా ఆడేందుకు నేను సిద్దంగా ఉన్నాను.

కొంచెం టైమ్ పడుతోంది..

కొంచెం టైమ్ పడుతోంది..

వాస్తవానికి నాకు మళ్లీ ఆర్‌సీబీలోకే వెళ్లాలనుంది. ఎందుకంటే గత 8 ఏళ్లుగా ఆ జట్టుతోనే ఉన్నా నేను. ఇతర జట్లకు వెళ్తే అక్కడంతా నాకు కొత్తగా ఉంటుంది. సెట్ అవ్వడానికి కొంత టైమ్ పడుతుంది. అయితే మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీ చాలా ఆలోచనలు చేస్తాయి. పర్స్ లెక్కలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాయి. ఏ జట్టు తీసుకున్నా నా నుంచి 100 శాతం ఎఫర్ట్ పెడుతాను. కాకపోతే కొత్త ప్రాంజీలో సెట్ అవ్వడానికి కొంత టైమ్ పడుతుంది.'అని చాహల్ చెప్పుకొచ్చాడు.

139 వికెట్లతో..

139 వికెట్లతో..

2011లోనే రూ.10 లక్షల కనీసధరకు ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన చాహల్ రెండేళ్ల తర్వాత 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన చాహల్.. 2014లో 14 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీసాడు. ఇక 2015లో రూ.10 లక్షల కనీస ధరకే ఆర్‌సీబీ చాహల్‌ను తీసుకోగా ఆ సీజన్‌లో 23 వికెట్లు, 2016లో 21 వికెట్లతో సత్తా చాటాడు.

2018 మెగా వేలంలో ఆర్‌సీబీ మళ్లీ అతన్ని రూ.6 కోట్లకు కొనుగోలు చేయగా.. గత సీజన్ వరకు అదే జీతాన్ని అందుకున్నాడు. ఓవరాల్‌గా 114 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 139 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు.

Story first published: Wednesday, February 2, 2022, 17:09 [IST]
Other articles published on Feb 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+