నా కెరీర్‌లో అతని పాత్ర చాలా కీలకం: యుజ్వేంద్ర చాహల్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ వెటోరీ తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించాడని టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. అతను ఇచ్చిన సలహాతోనే ఇన్నాళ్లు మెరుగ్గా రాణించగలుగుతున్నానని చెప్పాడు. కెరీర్ ప్రారంభంలో వెటోరీ అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానల్‌లో మాట్లాడిన చాహల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ధోనీ వికెట్ల వెనుకాల ఉన్నప్పుడు విలువైన సలహాలు ఇచ్చేవాడని గుర్లు చేసుకున్నాడు.

క్వాలిటీ స్పిన్నర్‌గా..
'2014లో నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఎంపికైన సమయంలో న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డానియల్ వెటోరీ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. నేను నాణ్యమైన స్పిన్నర్‌గా ఎదిగేందుకు అతను చాలా సహకారం అందించాడు. ఒక బౌలర్‌గా, అనుభవమున్న క్రికెటర్‌గా నాకు చాలా సలహాలు ఇచ్చాడు. నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోకుండా బంతిని ఎలా వేయాలనే విషయంపై కొన్ని సూచనలు చేశాడు. నాతో నెట్స్‌లో అదనపు ఓవర్లు బౌలింగ్ చేయించేవాడు. నేను మరింత మెరుగయ్యేందుకు అది ఉపయోగపడింది.

వీడియోలు పంపిస్తూ..
3-4 మ్యాచులు ఆడిన తర్వాత నేను బౌలింగ్ చేసిన వీడియోలను పంపేవాడు. ఏమైనా మార్పులు ఉంటే చెప్పేవాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచులుంటాయి. అందులో 3, 4 మ్యాచుల్లో విఫలమైనా, మిగతా మ్యాచుల్లో మాత్రం కచ్చితంగా మెరుగ్గా రాణించాలి. ఎకానమీ కూడా 7 లోపే ఉండేలా చూసుకోవాలి. మణికట్టుతో మ్యాజిక్ చేయాలి. బంతిని రిలీజ్ చేసే సమయంలో మణికట్టు స్థానాన్ని మార్చి.. ప్రత్యర్థి బ్యాటర్‌ను తికమక పెట్టాలని వెటోరీ చెప్పేవాడు. ఇప్పటికీ నేను ఇదే విషయాన్ని అనుసరిస్తున్నాను' అని యుజ్వేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు.

ధోనీ చిల్ బ్రో అంటూ..
ఇక మహేంద్ర సింగ్ ధోనీ కూడా తనకు ఎంతో అండగా నిలిచాడని, వికెట్ల వెనుకాల ఉంటూ అతనిచ్చే విలువైన సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నాడు. అయితే అన్నీ రోజులు మనవి కావనే విషయాన్ని కూడా ధోనీ నుంచి నేర్చుకున్నానని చాహల్ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికాతో ఓ టీ20 మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ తన బౌలింగ్‌ను చితక్కొట్టారని తెలిపాడు. 64 పరుగులు ఇచ్చుకున్న తన దగ్గరకు ధోనీ వచ్చి... ఇది నీ రోజు కాదని, ఎక్కువగా ఆలోచించకుండా చిల్ అవ్వాలని సూచించాడని చాహల్ గుర్తు చేసుకున్నాడు.

పరుగులివ్వకుండా..
అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా బౌలర్‌ను తిడితే మరింత ఒత్తిడికి లోనవుతారని చెప్పిన చాహల్.. ధోనీ తనకు అండగా నిలిచాడని చెప్పుకొచ్చాడు. 'నువ్వు వన్డేల్లో బాగా రాణించావు. ప్రతీ మ్యాచ్‌లో సత్తా చాటాలంటే కుదురదు. ఇతరులు కూడా ఆడుతున్నారు.'అని ధోనీ చెప్పాడని చాహల్ గుర్తు చేసుకున్నాడు. ఆ మాటలతో తాను కూడా రియలైజ్ అయ్యానని, ప్రతీ కూల పరిస్థితుల్లో ఎక్కువగా ఆలోచించకుండా, వికెట్ తీసే ప్రయత్నం చేయకుండా ఓవర్లు పూర్తి చేసే పనిచేస్తున్నానని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications