'పాపం.. ! స్వామి చాహల్‌కు సాయం చెయ్యి'


బ్రిస్బేన్: టీమిండియా యువ క్రికెటర్లు సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. వారికి సంబందించిన ప్రతీ అప్‌డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటారు. సహచర ఆటగాళ్లతో సరదా సన్నివేశాలు, ఫన్నీ వీడియోలు, వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తుంటారు. అయితే తాజాగా టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో తెగ ట్రోల్ అవుతోంది.
స్వామి సాయం చెయ్యి
ఇక వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ సైతం ‘స్వామి సాయం చెయ్యి' అంటూ చాహల్‌పై సెటైర్ వేశాడు. ఆ వీడియోలో ఏముందంటే.. కీలక ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా సెషన్ల వారిగా ప్రాక్టీస్ చేస్తూ టీమిండియా ఆటగాళ్లు చెమట చిందిస్తున్నారు. దీనిలో భాగంగా చాహల్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు.
చాహల్ రోజు ప్రోటీన్ పౌడర్ తీసుకో
‘బక్కపలచగా ఉండే చాహల్ రోజు ప్రోటీన్ పౌడర్ తీసుకో' అంటూ వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. ‘నువ్వు ఎంత ట్రై చేసినా గేల్‌లా బాడీ పెంచలేవు' అంటూ మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు.
న్యాయపరమైన ఖర్చులు వసూలు చేస్తాం: బీసీసీఐ
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తొలి టీ20ని బుధవారం ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ.. 12 మందితో కూడిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఇందులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం స్పినర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, కృనాల్ పాండ్యాలను ఎంపిక చేసింది. వెస్టిండీస్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో కలిపి కుల్దీప్ ఐదు వికెట్లు తీయగా, ఒకే మ్యాచ్ ఆడిన చాహల్ రెండు వికెట్లు తీశాడు.
టీమిండియా:
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications