న్యాయపరమైన ఖర్చులు వసూలు చేస్తాం: బీసీసీఐ


హైదరాబాద్: నష్టపరిహారం సాధించాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు పరాభవం తప్పలేదు. బీసీసీఐకే అనుకూలంగా తీర్పు రావడంతో పీసీబీ ప్రయత్నాలన్నీ వృథాప్రయాసగానే మిగిలింది. అయితే ఈ విషయంలో బీసీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. పీసీబీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధమైంది. న్యాయ పోరాటానికి పెట్టిన ఖర్చులను తిరిగి రాబట్టుకొనేందుకు ఆ బోర్డుపై తిరిగి కేసు వేయనుంది.

ఐసీసీకి కొద్ది నెలల క్రితమే ఫిర్యాదు
బీసీసీఐపై కక్ష్య సాధింపుకు పాల్పడిన పాక్‌కు ఇది సరైన సమాధానంగా భావించవచ్చు. తమతో 2015-2023 వరకు ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని పీసీబీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఆర్థికంగా నష్టపోయిన తమకు రూ.447 కోట్లు పరిహారం చెల్లించాలని బీసీసీఐపై ఐసీసీకి కొద్ది నెలల క్రితమే ఫిర్యాదు చేసింది. దీంతో ఐసీసీ ముగ్గురు సభ్యులతో పరిష్కార కమిటీ ఏర్పాటు చేసింది.
భారత జట్టు ప్రమాదకరం, అదృష్టాన్ని పరీక్షించుకుంటాం: ఫించ్

పీసీబీ ఫిర్యాదును తోసిపుచ్చిన ఐసీసీ
పూర్తిస్థాయి విచారణల విన్న తర్వాత పాక్ వాదనలో పసలేదని ఫిర్యాదును తోసిపుచ్చింది ఐసీసీ. ‘రెండు పార్టీల సాక్ష్యాలు, ఆధారాలను విచారించిన తర్వాత వివాద పరిష్కార కమిటీ పీసీబీ ఫిర్యాదును తోసిపుచ్చింది. ఆరు సిరీస్‌లు ఆడతామని బీసీసీఐ పంపించిన ఉత్తరం తన ఉద్దేశం తెలియజేసేదే తప్ప ఒప్పందం కాదని తేల్చిచెప్పింది.'

పీసీబీ నుంచి ఖర్చులను రాబట్టుకొనేందుకు బీసీసీఐ
ఈ తీర్పుపై స్పందించిన బీసీసీఐ 'కమిటీ నిర్ణయాన్ని బీసీసీఐ సాదరంగా స్వాగతిస్తోంది. ఇప్పుడు పీసీబీ నుంచి న్యాయ ఖర్చులను రాబట్టుకొనేందుకు బీసీసీఐ వివాద పరిష్కార కమిటీని సంప్రదించనుంది' అని ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే కేసు విషయంలో ఓటమితో కుమిలిపోతున్న పీసీబీకి ఇది చెంపపెట్టుగా మారనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications