Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సర్‌ప్రైజ్‌.. యూట్యూబర్‌ని పెళ్లాడిన యుజ్వేంద్ర చహల్‌!!

Yuzvendra Chahal marries YouTuber Dhanashree Verma in Gurugram
#DhanaSaidYuz : Yuzvendra Chahal Marries Youtuber Dhanashree Verma In Gurugram

ముంబై: టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్ ఓ ఇంటివాడయ్యాడు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మని వివాహం చేసుకున్నాడు. గురుగ్రామ్‌లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది. తమ వివాహ ఫొటోలను చహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఆ వెంటనే అతడి స్నేహితుడు పీయూష్ సచ్‌దేవ్ కూడా పెళ్లి ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇద్దరం ఒకటయ్యాం

ఇద్దరం ఒకటయ్యాం

మంగళవారం యుజువేంద్ర చహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలో పెళ్లిఫొటోలు పంచుకున్నాడు. 'గతంలో మా పరిచయం ఏర్పడింది, మేం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం. ఇద్దరం ఒకటయ్యాం' అని దానికి కాప్షన్ జత చేశాడు. కొత్త జంటకు అభిమానులతో పాటు క్రికెటర్లు అభినందలు తెలియజేస్తున్నారు. క్రిస్‌ గేల్, కర్ణ్‌ శర్మ, రోహిత్ శర్మ భార్య రితికా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. లాక్‌డౌన్‌లో చహల్‌, ధనశ్రీకి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ 'అవును' అనేశామని అప్పట్లో సోషల్ మీడియాలో వీరు ప్రకటించారు.

కంకషన్ సబ్‌స్టిట్యూట్‌‌గా

కంకషన్ సబ్‌స్టిట్యూట్‌‌గా

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్‌కు యుజువేంద్ర చహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 దుబాయ్‌కు షిఫ్టవగా.. కాబోయే భర్తతో పాటు ధనశ్రీ కూడా యూఏఈ వెళ్లింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా వెళ్లారు. అయితే ఆసీస్ పర్యటనలో చహల్ ప్రదర్శన నిరాశపరిచింది. రెండు వన్డేల్లో ఒక్క వికెట్ మాత్రమే తీసి 160 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌‌గా బరిలోకి దిగిన చహల్ నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

అల్లరి కుర్రాడు

అల్లరి కుర్రాడు

భారత వన్డే, టీ20 జట్టులో రెగ్యులర్‌ స్పిన్నర్‌గా కొనసాగుతున్న యుజువేంద్ర చహల్‌కి టెస్టుల్లో మాత్రం అవకాశాలు దక్కడం లేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఛాన్స్ దొరికిన మ్యాచ్‌లో సత్తా చాటుతున్నాడు. వన్డే, టీ20ల్లో తన మాయాజాలంతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా అల్లరి కుర్రాడు చహల్‌ మైదానంలో ఎంతో సరదాగా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కబుర్లు చెబుతుంటాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం 'చహల్ టీవీ'తో ఆటగాళ్లను సరదాగా ఇంటర్వ్యూ చేస్తుంటాడు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పెళ్లి చేసుకోవడం గమనార్హం.

యూట్యూబ్ ఛానల్ కూడా

యూట్యూబ్ ఛానల్ కూడా

ముంబైలో జన్మించిన ధన్యశ్రీ వర్మ మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. అంతేకాకుండా తాను ఓ యూట్యూబ్ ఛానల్‌ని సైతం నడుపుతోంది. ఆమె తండ్రి సాగర్ వర్మ వ్యాపార వేత్త. తల్లి వర్ష వర్మ డెంటిస్ట్‌. దీంతో తొలుత డాక్టర్ కావాలని ఆశపడిన ధన్యశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధన్యశ్రీకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు.

ISL 2020 21: నార్త్‌ఈస్ట్‌, ఒడిశా మ్యాచ్‌ డ్రా!!

Story first published: Wednesday, December 23, 2020, 8:19 [IST]
Other articles published on Dec 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+