Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: నార్త్‌ఈస్ట్‌, ఒడిశా మ్యాచ్‌ డ్రా!!

NorthEast United FC

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2020-21 సీజన్‌లో భాగంగా నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ, ఒడిశా ఎఫ్‌సీ జట్ల మధ్య చివరి వరకు ఉత్కంఠగా సాగిన జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. గోవాలోని బంబోలిమ్‌లోని జిఎంసి అథ్లెటిక్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచులో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 2-2తో సమమైంది. ఈ మ్యాచులో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా విజయాన్ని మాత్రం అందుకోలేదు.

నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ తరఫున బెంజామిన్‌ లాంబోట్ ‌(45+2వ నిమిషంలో), క్వెసి అపియా (65వ నిమిషంలో) గోల్స్‌ చేశారు. ఒడిశా ఎఫ్‌సీ తరఫున డిగో మోరిసియో (22వ నిమిషం) తొలుత ఖాతా తెరువగా.. చివరగా కోల్‌ అలెగ్జాండర్‌ (67వ నిమిషంలో) గోల్‌ బాది స్కోర్లను సమం చేశాడు. తొలి అర్ధభాగంలో నార్త్‌ఈస్ట్‌ ఆధిపత్యం చెలాయించినా.. రెండో భాగంలో ఒడిశా పుంజుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా పోరాడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

నార్త్‌ఈస్ట్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచులలో రెండు విజయాలు, ఒక ఓటమిని చవిచూసింది. ఇక ఐదు మ్యాచులను డ్రాగా ముగించింది. 11 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఒడిశా ఆడిన ఏడు మ్యాచులలో ఒక్క విజయాన్ని అందుకోలేదు. రెండు డ్రాలు, ఐదు పరాజయాలను ఎదుర్కొంది. రెండు పాయింట్లతో పదవ స్థానంలో ఉంది. ఈ రోజు జంషెడ్పూర్ ఎఫ్‌సీ, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పట్టికలో జంషెడ్పూర్ 5వ స్థానంలో, 7వ స్థానంలో గోవా ఉన్నాయి.

Story first published: Wednesday, December 23, 2020, 7:44 [IST]
Other articles published on Dec 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+