బట్టలేసుకున్న కోహ్లీ..వేసుకోని కోహ్లీ..మిగతాదంతా సేమ్ టు సేమ్..ఆర్సీబీ ట్వీట్‌కు చహల్ ఫన్నీ కామెంట్

హైదరాబాద్: కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ దుబాయ్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధలకు సంబంధించిన ఎస్ఓపీ డ్రాఫ్ట్‌ను ఫ్రాంచైజీలకు అందజేసింది. ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్లను దుబాయ్ తరలించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ముంబై, చెన్నై జట్లు అయితే భారత్‌లోనే ప్రాక్టీస్ క్యాంప్‌లు నిర్వహించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీలు.. అభిమానులను ఆకర్షించేందుకు క్యాంపైన్ మొదలు పెట్టాయి. ఫన్నీ ట్వీట్స్, సరదా మీమ్స్‌తో అభిమానులను అలర్ట్ చేస్తున్నాయి.
సింహం.. కోహ్లీ తేడా ఏంటిది..?
ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సోమవారం తమ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. వరల్డ్ లయన్ డే సందర్భంగా.. సింహం, విరాట్ కోహ్లీ ఫొటోలను పక్కపక్కన పెట్టి.. రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పమని, తాము గుర్తించలేకపోతున్నామని అభిమానులను ప్రశ్నించింది. దీనికి #PlayBold #WorldLionDay యాష్ ట్యాగ్‌లను జతచేసింది. దీంతో అభిమానులు తమకు తోచిన సమాధానాలు చెబుతున్నారు. కొందరు సరదా వ్యాఖ్యలతో కామెంట్ చేస్తుంటే.. ఇంకొందరు ఆర్సీబీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
డ్రెస్సే తేడా..
ఇక సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ప్రతీ ఒక్కరిపై వ్యంగ్యస్త్రాలు సంధించే టీమిండియా లెగ్ స్పిన్నర్, ఆర్సీబీ ప్లేయర్ యజువేంద్ర చహల్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘ఫస్ట్ పిక్‌లో బట్టలు వేసుకున్నాడు. సెకండ్ పిక్‌లో వేసుకోలేదు అంతే.. అదే తేడా'అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. కోహ్లీ ఒక సింహం అంటూ పరోక్షంగా ప్రశంసించాడు. ఈ కామెంట్‌పై ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. షర్ట్ లెస్ కోహ్లీ, సింహం ఫొటో పెట్టి ఇప్పుడు చెప్పు చహల్ అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరూ ‘ఆ మాత్రం పొగడకుంటే జట్టులో చోటు దక్కదులే.. మాకు తెలుసులే నీ ఉద్దేశం'అంటూ సెటైర్లు వేస్తున్నారు. సూపర్ జోక్ భాయ్.. చితక్కొట్టే మీమ్స్‌ను కామెంట్ చేస్తున్నారు.
కింగ్ ఆఫ్ క్రికెట్/ఫారెస్ట్..
ఇక విరాట్ అభిమానులు.. ఆర్సీబీ ట్వీట్‌పై స్పందిస్తూ... ఒకరు కింగ్ ఆఫ్ కోహ్లీ అయితే ఇంకొకరు కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని ప్రశంసిస్తున్నారు. బయటకు చెప్పలేని తేడా దాచగలిగే రిప్లే అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇక చెన్నై అభిమానులు ‘ధోనీ, సింహాం ఫొటో పెట్టి బిగ్ బ్రదర్ ఇక్కడా'అని బదులిస్తున్నారు. ఇంకొందరు ఈ మధ్య ఆర్‌సీబీని ఉద్దేశించి ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్‌ను షేర్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఆర్‌సీబీ లోగో.. ఐపీఎల్ టైటిల్ దూరంగా పెట్టి భౌతిక దూరం అంటే ఇదని కామెంట్ చేస్తున్నారు.
టైటిల్ కోసం నిరీక్షణ..
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు విజేతగా నిలవలేకపోయింది. ‘ఈసాల కప్ మన్‌దే'అనే స్లోగన్‌తో రావడం.. ఒట్టి చేతులతో వెనుదిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా విజేతగా నిలవలేకపోయింది. 2009లో డెక్కన్ చార్జెస్ హైదరాబాద్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది. 2016లో టోర్నీ ఆద్యాంతం ఆధిపత్యం కనబర్చిన ఆర్సీబీ.. ఫైనల్లో సన్‌రైజర్స్ చేతిలో ఓడి టైటిల్ అందుకోలేకపోయింది. అనంతరం జరిగిన మూడు సీజన్లలో కనీసం ప్లే ఆఫ్ కూడా చేరలేదు. ఈ సారైనా విజయం సాధించాలనే ఆశతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications