Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి కాబోతున్న యుజ్వేంద్ర చాహల్?

Yuzvendra Chahal leaves fans confused with his latest Instagram story

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తండ్రి కాబోతున్నాడా? అతని సతీమణి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గర్భవతా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతను షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చాలా చురుకుగా ఉండే చాహల్ ఎప్పుడూ తనదైన పోస్ట్‌లతో నవ్వులు పూయిస్తాడు. ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ సహచర ఆటగాళ్లకు చికాకు తెప్పిస్తాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండ్ యువరాజ్ సింగ్‌ను అయితే కేసుల పాలే చేశాడు.

ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా తన ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ట్విటర్ హ్యాండిల్‌ను హ్యాక్ చేసి ఫన్నీ ట్వీట్స్‌తో అభిమానులను అయోమయానికి గురి చేశాడు. తాననే తదుపరి కెప్టెన్ అంటూ రచ్చ చేశాడు. సహచర బ్యాటర్ జోస్ బట్లర్‌ను ఓ ఆటఆడుకున్నాడు. అంత సరదాగా ఉండే చాహల్ మంగళవారం సీరియస్ పోస్ట్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఎన్నడు లేనివిధంగా ఓ క్రియేటివ్ పిక్చర్‌ను షేర్ చేశాడు. దానిపై 'న్యూ లైఫ్ లోడింగ్'అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో అతని సతీమణి ప్రెగ్నెంట్ అయినట్లుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే చాహల్ తండ్రికానున్నాడని అభినందనలు తెలుపుతున్నారు.

రెండు రోజుల క్రితమే చాహల్ సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అతని సతీమణి ధను శ్రీ వర్మ విషయంలో కొందరు ఆకతాయిలు హద్దులు ధాటి విమర్శలు గుప్పించారు. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చాహల్ సతమణితో ఎఫైర్ ఉందంటూ ఆరోపించడమే కాకుండా జాగ్రత్తగా ఉండాలని చాహల్‌కు సూచించారు. లేకుంటే టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సూర్య ఇచ్చిన పార్టీకి ధనశ్రీ చాహల్‌తో కాకుండా సూర్యకుమార్ యాదవ్‌తో హాజరవ్వడమే ఈ సందేహాలకు దారితీసింది.

ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన చాహల్.. టీమిండియా తరఫున అదే జోరు కనబర్చాడు. దాంతో ఆసియాకప్ బెర్త్ కనార్ఫ్ చేసుకున్న అతను పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు సిద్దమవుతున్నాడు. ఆసియాకప్ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనకు అతను దూరంగా ఉన్నాడు.

Story first published: Wednesday, August 17, 2022, 18:30 [IST]
Other articles published on Aug 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+